మీ కిడ్నీలను క్లీన్ చేసే ఆహారాలు ఇవి.. రోజూ తీసుకోవాల్సిందే..!

మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. ఇవి మ‌న ర‌క్తంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను వ‌డ‌క‌ట్టి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గలుగుతాము. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక మూత్ర‌పిండాల‌ను ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వాటిలో వ్య‌ర్థాలు, మ‌లినాలు పేరుకుపోకుండా వాటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవాలి. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మూత్రపిండాల్లో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ వేగవంతంగా జ‌రుగుతుంది.

దీంతో మూత్ర‌పిండాలల్లో మ‌లినాలు పేరుకుపేకుండా శుభ్రంగా ఉంటాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు వాటిని శుభ్రంగా ఉంచే ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో బ్లూబెర్రీలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఆంథోసైనిన్స్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి మూత్ర‌పిండాల్లో వ‌చ్చే ఇన్ ప్లామేష‌న్ ను తగ్గించ‌డంతో పాటు డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రిగేలా చేస్తాయి. అలాగే ఫ్రీరాడికల్స్ కార‌ణంగా మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తిన‌కుండా కాపాడ‌డంలో కూడా బ్లూబెర్రీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో నిమ్మ‌క్కాయ నీరు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

take these foods daily to clean your kidneys take these foods daily to clean your kidneys

నిమ్మ‌కాయ నీటిలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో, మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చేయ‌డంలో ఈ నిమ్మ‌కాయ నీరు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల యుటిఐ వంటి బ్యాక్టీరియ‌ల్ ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. అలాగే ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల ఆరోగ్యం, ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గ‌డంతో పాటు రాళ్లు కూడా ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. అలాగే ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బతిన‌కుండా ఉంటుంది.

అదే విధంగా వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే సల్ఫ‌ర్ స‌మ్మేళ‌నాలు మూత్ర‌పిండాల నుండి మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో, మూత్ర‌పిండాల‌ల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చేయ‌డంలో, మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా వెల్లుల్లి రెబ్బ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. పుచ్చ‌కాయ‌లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. మూత్రం ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేసి దాని ద్వారా మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో అలాగే మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, మూత్ర‌పిండాలు స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేయ‌డంలో కూడా పుచ్చ‌కాయ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది.

 

అలాగే ప‌సుపును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ప‌సుపులో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఆపిల్స్, అవ‌కాడో, క్యాబేజి, అల్లం వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల్లో మ‌లినాలు పేరుకుపోకుండా ఉండ‌డంతో పాటు మూత్ర‌పిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts