హెల్త్ టిప్స్

చలికాలం ఇవి తింటే మీ చర్మం పొడిబార‌దు..!

చలి కాలం అనగానే ఎన్నో రకాల వైరస్ లకు అనువైన కాలం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే చాలు అనేక రకాల వ్యాధులు చుట్టూ ముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో చర్మం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలంలో కొన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడాలి అంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తింటే మేలు చేస్తుందని అంటున్నారు వైద్యులు.

నిమ్మ, నారింజ, ఆపిల్‌, జామ తదితర తాజా పండ్లన్నిటిలో అధికంగా ఉండే విటమిన్‌-సి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. బాదం, పిస్తా, ఆక్రోట్‌, పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్‌- ఇ ఉంటుంది. ఇది చ‌ర్మానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే అరటి పండ్లు, ఉడికించిన దుంపలు, సెనగల్లోని విటమిన్‌- బి6 కూడా చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. క్యారెట్‌, బొప్పాయి, గుమ్మడి తదితరాల్లోని విటమిన్‌- ఎ చ‌ర్మాన్ని సంర‌క్షించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

take these foods to get moisturising skin in winter

ఆకుకూరలు, పప్పు ధాన్యాల్లో ఉండే ఫోలేట్‌, సూర్యరశ్మి ప్రసాదించే విటమిన్‌-డి మ‌న చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. ఇక మాంసాహారం, ఆకుకూరల నుండి వచ్చే ఐరన్ తోపాటు పెరుగు, మజ్జిగలలోని ప్రోబయాటిక్స్ చ‌ర్మానికి ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటితోపాటు ఫాటీ యాసిడ్లు ఉన్న బాదం, ఆక్రోట్‌, పిస్తా లాంటి గింజలను రోజూ తీసుకుంటే చ‌ర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే సూప్స్ తాగితే చర్మానికి మేలు చేస్తాయ‌ని వైద్యులు చెప్తున్నారు. కనుక చ‌లి కాలంలో ఈ ఆహారాల‌ను తింటుంటే చ‌ర్మాన్ని పొడి బార‌కుండా సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.

Admin

Recent Posts