హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవి.. తింటే మీ గుండె చాలా సేఫ్‌..!

మనం తినే ఆహారంలో కనీసం 3గ్రాముల ఫైబర్, 200మిల్లీ గ్రాముల లోపు ఉప్పు, 15-20గ్రాముల లోపు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటే గుండెకు చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే మన గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు 10రకాల స్నాక్స్ ఉన్నాయండోయ్​.. మరి అవేంటో చూసేద్దాం రండి… జీడిపప్పు, బాదం, పిస్తా లాంటి నట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవని తెలిసిందే. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటున్నారని తాజాగా 25 స్టడీల్లో తేలిందట. అలాగే యాపిల్ కూడా గుండె సమస్యలను అరికడుతుంది. పచ్చిబఠానీలు తినడం గుండెకు చాలా మంచిది. వీటిలోని ఫైబర్, స్టెరాల్స్, సిటోస్టెరాల్ వంటివి శరీరంలో కొవ్వును తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

చియా విత్తనాలు, పంచ్ విత్తనాలు, అవిసె గింజలు, జనపనార‌ గింజలలో ఓట్స్, నట్స్ లాంటివి కలిపి తింటే గుండెల్లో నొప్పి, మంట రాకుండా ఉంటుంది. క్యారెట్లను బాగా వేయించి తీసుకోవడం వల్ల రుచికరమైన స్నాక్స్ తినడమే కాక, మీ గుండెకు కావాల్సిన ఫ్యాట్​ను అందించిన వారవుతారు. గుమ్మడికాయ గింజల్లో అధికంగా లభించే మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ తగ్గించడమే కాక.. గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వీటిని చక్కగా వేయించుకుని వాటికి నట్స్ లాంటివి జత చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ మీ సొంతం.

take these healthy snacks daily so that your heart can be healthy

ఆకుకూరల్లో చాలా న్యూట్రియన్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతోపాటు వీటిలో ఉండే పొటాషియం రక్తప్రసరణను తగ్గిస్తాయి. చాలా మంది పాల పదార్థాలు గుండెకు మంచివి కాదంటారు. కానీ నిజానికి పెరుగు గుండెకు చాలా మంచిదని తాజాగా చేసిన స్టడీలు చెబుతున్నాయి. కందికాయల‌ను సరదాగా తింటారు. కానీ నిజానికి ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వీటిలో కొవ్వు తక్కువగా ఉండటంతోపాటు ఫైబర్, పాలీ-అన్ సాచురేటెడ్ ఫ్యాట్, ఫైటో న్యూట్రియన్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటికి కాస్త నిమ్మరసం, పెప్ప‌ర్ లాంటివి జత చేసుకుని తింటే మీ స్నాక్స్ అదుర్స్.

Admin

Recent Posts