హెల్త్ టిప్స్

దీన్ని తాగితే.. హైబీపీ ఎంత ఉన్నా.. వెంట‌నే త‌గ్గుతుంది..!

30 ఏళ్లు దాటకముందే ఎంతో మంది యువత రక్త పోటు సమస్యతో సతమతమవుతున్నారు. దీన్నే బ్లడ్ ప్రెజర్ (BP) అని అంటారు. ఈ రక్తపోటు సమస్య తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా కూడా ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు మన నియంత్రణలో ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి మంచి చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇండ్ల‌లో ఉండే మసాలా దినుసులలో గసగసాలు కూడా ఒకటి. ఈ గసగసాలలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గసగసాల ద్వారా థయామిన్, కాల్షియం, మాంగనీస్, ప్రొటీన్లు, ఒమెగా -3, ఒమెగా -6 వంటి ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి.

take this drink your bp will be reduced how much it is

ఒక గ్లాసు పాలలో పావు టీస్పూన్ గసగసాల‌ను వేసి ఉడికించి ఆ పాలను సేవించడం ద్వారా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనే ఆలోచన ఉండేవారికి కూడా ఈ డ్రింక్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. గసగసాలలో ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహకరిస్తుంది.

అదేవిధంగా గసగసాలను నోట్లో వేసుకొని నమలడం ద్వారా నోట్లో పుండ్లు, అల్సర్లు వంటివి రాకుండా ఉంటాయి. శరీరంలో అధిక వేడితో బాధపడుతున్నవారు కూడా గసగసాల‌ను నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా వేడి సమస్య తగ్గుముఖం పట్టి ఒంటికి చలువ చేస్తుంది. ఇలా గ‌స‌గ‌సాల‌తో ప‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts