హెల్త్ టిప్స్

ఎముకలు దృఢంగా ఉండాలంటే టమోటాలు తినాల్సిందే..!

రోజూ ఓ టమోటాను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికెంతో మేలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉడికించిన పాలకూర రసం, టమాటా రసం సమపాళ్ళలో కలిపి రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. దీనివల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. టమాటాను సన్నగా తరిగి పెరుగులో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఆకలి లేమితో బాదపడేవారు టమాటాను ముక్కలుగా తరిగి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే సమస్య దూరమవుతుంది. రోజూ ఓ పచ్చి టమాటాను తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

మీరు బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తారు. వెంటనే భోజనం చేసే అవకాశం లేకపోతే అరటిపండు తినడం మంచిది. ఈ పండులో పొటాషియం, లవణాలు మీ ఆకలిని వెంటనే భర్తీ చేస్తాయి. అంతేకాదు మరిన్ని ఖనిజాలు మినరల్స్‌కు ప్రధాన వనరు అరటిపండు. మీరు గమనించారా అందుకే క్రీడాకారులు తాము కోల్పోయే లవణాలను తక్షణం భర్తీ చేసుకోవడానికి అరటి పండు తింటుంచారు.

take tomatoes daily to keep bones strong

మధుమేహ వ్యాధిగ్రస్థులకు డాక్టర్లు ఒక ఆరోగ్య సూత్రం చెబుతుంటారు. భూమిలో పండే దుంపలు తినవద్దని, అందులో కార్బొహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్ రోగులకు అవి మంచివి కావని సలహా ఇస్తారు. అయితే చిలగడదుంపను మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దీనినుంచి విడుదలయ్యే చక్కెర పాళ్లు చాలా తక్కువ. పైగా ఇందులో విటమిన్ ఎ కూడా ఎక్కువ. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు నిరభ్యంతరంగా తినదగ్గేదే ఈ చిలగడ దుంప.

Admin

Recent Posts