Weight : రోజూ మనం తీసుకునే అనేక రకాల ఆహారాలు మన శరీర బరువును పెంచేందుకు, తగ్గించేందుకు కారణమవుతుంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే శరీర బరువు తగ్గుతారు. అదే అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే బరువు పెరుగుతారు. కనుక రోజూ తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
ఇక రాత్రిపూట చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటుంటారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను రాత్రి పూట తీసుకున్నా మంచిది కాదు. అవి మన శరీర బరువును పెంచుతాయి. అవేమిటంటే..
1. రాత్రి పూట క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోరాదు. వీటి వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాక కొవ్వుగా మారుతుంది. అధికంగా బరువు పెరుగుతారు. కనుక ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవాలి. రాత్రి పూట మానేయాలి.
2. రాత్రి పూట మాంసాహారం తినడం కూడా మంచిది కాదు. అది కూడా త్వరగా జీర్ణం కాదు. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. బరువు పెరుగుతారు. కాబట్టి నాన్‌వెజ్‌ను రాత్రి పూట తినరాదు.
3. రాత్రి పూట టీ, కాఫీ, గ్రీన్ టీ వంటి వాటిని తాగరాదు. వాటిల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది కనుక.. రాత్రి పూట నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. సరిగ్గా నిద్రించకపోతే బరువు పెరుగుతారు. కాబట్టి రాత్రి పూట టీ, కాఫీలను మానేయాలి.
4. రాత్రి సమయంలో చాలా మంది మద్యం సేవిస్తుంటారు. దీని వల్ల కూడా శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరుతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. బరువు తగ్గుదామని ప్లాన్ వేసిన వారి ప్రయత్నాలు వృథా అవుతాయి. కాబట్టి రాత్రి పూట మద్యం సేవించరాదు.
ఈ విధమైన అలవాట్లను పాటిండచం వల్ల రాత్రి పూట శరీరాన్ని తేలిగ్గా, లైట్‌గా ఉంచుకోగలుగుతారు. బరువు తగ్గడం తేలికవుతుంది. రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తింటే మంచిది. దీంతో తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమవుతాయి. బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉంటుంది.