హెల్త్ టిప్స్

మ‌నం తింటున్న చైనీస్ ఫుడ్ నిజానికి అస‌లు చైనా ఫుడ్డేనా..?

చైనా దేశపు ఆహారాలు ప్రపంచంలోని అన్ని దేశాలలోకి చొరబడ్డాయి. ప్రతి దేశం కూడా వారి స్ధానిక అభిరుచులకు తగ్గట్టు వాటిని మార్చుకుంటూ చైనీస్ ఫుడ్ గా చెలామణీ చేసి, వాణిజ్యపరంచేసి ఆనందిస్తున్నారు. కనుక అసలు సిసలైన చైనీస్ ఫుడ్ వాస్తవానికి మనం ఆనందించటమే లేదు. అసలు సిసలైన చైనీస్ ఫుడ్ చాలా ఆరోగ్యమైంది. కాని అది ఆ రూపంలో దొరకటం కష్టమే.

చైనీస్ వంటకాలు …బాగా వేయిస్తే..అది ఆరోగ్యం కాదు. నిజమైన చైనీస్ వంటకాలలో అతి తక్కువ వాటికి వేపుడు వుంటుంది. చైనీస్ అంటూ మనం వేయించేవి వారి దేశంలో అసలు తినరు. ఫ్రైడ్ రైస్ – ఉడికించినదైతే చక్కగా తినేయండి. సీ ఫుడ్స్, వెజిటబుల్స్ వేసి ఉడికించే అసలైన చైనీస్ ఫ్రైడ్ రైస్ ఆరోగ్యమే. వీరు ఉపయోగించే రైస్ పాలిష్ పట్టి కూడా వుండవు.

the chinese food we are eating is it really from china

కొంచెం వేపుడు – గిన్నెలో కొద్దిసేపు తిప్పేస్తే వారి వేపుడు అయిపోతుంది. ఇంతకంటే అధికంగా వారికి వేరే ఏ వేపుడూ వుండదు. సూపులు, డిమ్ సమ్ లు? – చైనీస్ వంటకాలలో ఈ రెండూ చాలా ఉత్తమమైనవి. ఉడికించినవి. కొవ్వు లేని అనేక పోషకాలు లభిస్తాయి. చైనీస్ గ్రాస్ – దీనిలో మసాలాలు వేయకుండా తయారు చేస్తే అది అసలైన చైనా వంటకమే. మొత్తంగా చెప్పాలంటే, చైనా దేశపు అసలైన వంటకాలు ఆరోగ్యకరమే!

Admin

Recent Posts