Rice : వేడి వేడి అన్నంలో మామిడి కాయ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందని కొందరు అంటారు. కొందరు పప్పు, సాంబార్ వంటివి వేడి వేడి అన్నంలోకి బాగుంటాయని అంటారు. మరికొందరు వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకుని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుందని అంటారు. వీటి రుచి మనకు తెలియాలంటే వేడి వేడి అన్నం ఖచ్చితంగా ఉండాలి. అన్నాన్ని మనం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము. కొందరికి మాత్రం వేడి వేడి అన్నం ఖచ్చితంగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో అన్నం మానేస్తే బరువు తగ్గుతారు. అన్నం మానేస్తే షుగర్ తగ్గుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇన్ని సమస్యల నేపథ్యంలో అన్నం తినాలా వద్దా తింటే రోగాలు వస్తాయా అని చాలా మంది సందేమ పడుతుంటారు.
ఈ సందేహాలన్ని మానుకుని హాయిగా అన్నం తినమని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండడానికి అన్నం మానుకోవాల్సిన పని లేదు. ఇటీవలి కాలంలో చాలా మంది తెల్లనివి మానుకోవాలని చెబుతున్నారు. కానీ వాటికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అన్నం తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటారనేది అబద్దం. మన పూర్వీకులు అన్నం తినే ఆరోగ్యంగా జీవించారు. మనకంటే ఆరోగ్యంగా జీవించారు. దీని బట్టి అన్నంతో సమస్య లేదని అర్థం అవుతుంది. అన్నం మానేస్తే బరువు తగ్గామని చాలా మంది అంటున్నారు. బరువు, లావు తగ్గడానికి కొంతమంది కొన్ని రకాల ఆహార పద్దతులను పాటిస్తున్నారు.
ఆ తరువాత తగ్గడానికి కారణం అన్నమానుకోవడమేనని నిర్దారణకు వస్తున్నారు. సాధారణ ప్రజల కంటే అధికంగా శ్రమ చేసే వారు మూడు నాలుగు రెట్లు ఎక్కువగా అన్నాన్ని తింటారు. కానీ వాళ్లు వీళ్లకంటే లావుగా ఉండాలి కదా. కానీ దానికి విరుద్దంగా ఉంది. తక్కువ అన్నం తిన్న వారి కంటే ఎక్కువ అన్నం తిన్న శ్రామికులు పొట్ట లేకుండా కండలు తేలి ఉన్నారు. దీని బట్టి సమస్య శారీరక శ్రమ లేకపోవడమేనని అర్థం అవుతుంది. అమెరికాలో అన్నం తినరు. కానీ ప్రపంచంలో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉన్న దేశం అమెరికానే. ఇతర దేశాల్లో కూడా అదేవిధంగా ఉంది. అన్నం తింటే రక్తంలోకి ఎక్కువ క్యాలరీలు, శక్తి వస్తుందంటారు. గ్లైసమిక్ ఇండెక్స్ ప్రకారం బియ్యం, ఇతర ధాన్యాల ఇండెక్స్ దాదాపు సమానంగానే ఉంటుంది.
అన్నం తింటే వెంటనే రక్తంలోకి ఎక్కువ శక్తి వచ్చేది నిజమే. వాస్తవానికి ఎవరూ కూడా ఒక్క అన్నాన్ని మాత్రమే తినరు. అన్నంలోకి పెరుగు, కూర, ఇతర పదార్థాలు కలుపుకుని తింటారు. కాయగూరల ఇండెక్స్ ధాన్యం ఇండెక్స్ లో సగం కూడా ఉండదు. అన్నంలో ఇవి కలవడం వల్ల ఆహారం తిన్న తరువాత రక్తంలోకి విడుదలయ్యే క్యాలరీలు తగ్గుతాయి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చపాతీ, పుల్కా కంటే అన్నం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. బియ్యం ఆరోగ్యకరమైన ధాన్యం. ఇందులో గ్లూటిన్ ఉండదు. మైదాలో, గోధుమ పిండిలో గ్లూటిన్ ఉంటుంది. గ్లూటిన్ కొన్ని రకా రోగాలు ఉన్న వారికి హాని చేస్తుంది. గంజి, మెత్తని అన్నం, జావ అన్నం వంటివి శరీరానికి ఎటువంటి హానిని చేయవు.
బియ్యంలో బి విటమిన్స్ తో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. అన్నం మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ లేదా సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్, అసిడిటి వంటి సమస్యలు వస్తాయి. అనన్నంలో మీలింగ్ పవర్ ఉంటుంది. అది అల్సర్ ను తగ్గిస్తుంది. అన్నంలో ఉండే టైరోసిన్ యాసిడ్ అల్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అన్నం వల్ల విరోచనం సాఫీగా అవుతుంది. చపాతీ, పుల్కా తింటే విరోచనం సాఫీగా అవుతుందనేది ఒక అపోహ మాత్రమే. జీర్ణావయం, ప్రేగుల్లో అన్నమే ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. అలాగే వేడి వేడి అన్నాన్ని కూడా తీసుకోకూడదు. వేడి వేడి అన్నాన్ని తీసుకుంటే శరీరంలో శక్తి హరించుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అన్నం వండిన వెంటనే తినకుండా కాస్త చల్లారిన తరువాత తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగని అన్నం పూర్తిగా చల్లారిన తరువాత కూడా తినకూడదు. కొద్దిగా వేడిగా ఉండగానే అన్నాన్ని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందట. అలాగే వేయించిన బియ్యం ఒక కప్పు, వేయించిన పెసరపప్పు అర కప్పు, ఒక కప్పు పాలు, నాలుగు గ్లాసుల నీటిని వేసి అన్నాన్ని ఉడికించాలి. తరువాత కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి ఇంగువ, ధనియాలు, శొంఠి, పిప్పళ్లు, ఉప్పు అన్నీ కొద్ది కొద్దిగా వేసి తాళింపు చేసుకుని ఆ అన్నాన్ని తింటే కఫ, వాత, పిత్త దోషాలు పోతాయట. ఈ విధంగా తినడం వల్ల ఆకలి పెరిగి రక్తశుద్ధి అవుతుంది. ప్రాణశక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అన్నం రోజూ తీసుకుంటే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అన్నం తినాలా వద్దా అనే అపోహని తీసేసి అన్నాన్ని ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.