హెల్త్ టిప్స్

ఆరోగ్యానికి ఏడు అద్భుతమైన ఆహారాలు…!

మునగకాయ: దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి. బీట్‌రూట్: బీట్‌రూట్ కేన్సర్‌తో పోరాడే అద్భుత గుణాలున్న బీట్‌రూట్‌లోని ఎర్రటి పిగ్మెంట్‌ సహజమైనది. అంతేకాకుండా ఇందులో ఫోలేట్‌లు అధికంగా వున్నాయి. దీని లాభాలు ఎన్నో తెలుసా! బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

క్యాబేజ్: క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. పోషకాలు నిండుగా వున్న క్యాబేజ్‌ను మనం భలే నిర్లక్ష్యం చేస్తాం. ఇందులో వున్న సల్ఫోరాఫేన్‌ కేన్సర్‌ను పోరాడే ఎంజైమును అధికంగా వుందని తెలిస్తే? వాడకాన్ని పెంచుతాం కదూ?! కాలీఫ్లవర్: పచ్చటి ఆకుల మధ్య ముద్దగా కనిపించే తెల్లటి పూలగుచ్ఛమే కాలీఫ్లవర్‌. ఇది ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్‌ బొకేలా ముచ్చటగా వుంటుంది. క్యాలీప్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ బి5, బి6, మాంగనీస్‌, ఫాటీ యాసిడ్లు కూడా అందులో వుంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, సోడియం మినరల్స్‌ కూడా కాలీఫ్లవర్‌లో లభిస్తాయి. కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కొందరిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. వీటిలో వుండే ప్యురీన్లు అనే పదార్థాలు దీనికి కారణం. అయితే అందరికీ ఈ సమస్య ఎదురుకాదు.

these are 7 best vegetables you must take regularly

కాకరకాయ: కాకరకాయ చేదుగా ఉన్నా ఎంతో ఆరో గ్యాన్నిస్తుంది. జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. జ్వరం, నులి పురుగులను నశింప చేస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలను ఫొలేట్‌, మెగ్నీషియం, జింక కూడా సమృద్ధిగా అందిస్తుంది. ఎటువంటి వ్యాధి లేని వారు కూడా మంచి షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంచుకోవటం కోసం మరియు ఆరోగ్యాన్ని బాగా చూస్కోవటం కోసం కాకర కాయని తిస్కోవాలి. ఇందులో ఐరన్ బాగా ఎక్కువగా ఉండటం వలన మరియు కేలోరిస్ తక్కువగా ఉండటం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి దోహదపడే దీన్ని అస్సలు పక్కన పెట్టొద్దు. ఇందులోని కెరోటినాయిడ్స్‌ మనకు అన్నివిధాలా మంచివి. పాలకూర: మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి. ఆరోగ్యానికి దోహదపడే దీన్ని అస్సలు పక్కన పెట్టొద్దు. ఇందులోని కెరోటినాయిడ్స్‌ మనకు అన్నివిధాలా మంచివి. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి.

గుమ్మడి మరియు గుమ్మడి గింజలు: గుమ్మడిలో విటమిన్‌ ఎ పుష్కలంగానూ, కేలరీలు తక్కువగానూ కలిగిన కూరగాయ. ఇందులో ఫైబర్‌ ఎక్కువశాతం వుంది. అంతేకాక వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. చిక్కుడు: చిక్కుడు కాయగురాల్లో చాలామంచిది. బీన్స్ ఉడికించి తెన్నా వేయించి తెన్నా మన శరీరానికి మేలుచేస్తాయి . వారానికి ఒకసారైనా తినాలి . ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి . చిక్కుడు లో పీచుపదర్ధము ఎక్కువ ఉండడం వల్ల రక్తం లోని కొలెస్టరాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది . అనినో ఆమ్లాలు , పొటాసియం ఉన్నందున గుండె ఆరోగ్యం గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. బి విటమిన్లు , ఫోలేట్ సంవృద్దిగా ఉంటాయి .

Admin

Recent Posts