హెల్త్ టిప్స్

Kidney Failure : మీరు రోజూ తినే ఈ ఆహారాల వ‌ల్లే కిడ్నీలు పాడవుతున్నాయి తెలుసా..?

Kidney Failure : చాలామంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పొరపాట్లు చేయకూడదు. మనం తినే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. మరి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు..?, కిడ్నీలు ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన పాడవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

కిడ్నీ సమస్యలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. శరీరంలో వాపు కలగడం, చర్మం దురద పెట్టడం, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది కలగడం, చికాకు ఇలాంటివి ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు క‌చ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఎక్కువ మద్యం తీసుకోవడం వలన కిడ్నీలు బాగా దెబ్బతింటాయి.

these foods can cause kidneys failure

ఎక్కువ మద్యం తీసుకుంటే మూత్రపిండాల పనితీరులో ఇబ్బంది కలుగుతుంది. మెదడుని ఇది ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ కిడ్నీపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ తీసుకోవడం వలన కూడా మూత్రపిండాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాఫీ ఎక్కువగా తాగితే కిడ్నీలు పాడవుతాయని గుర్తు పెట్టుకోండి. ఉప్పు తీసుకోవడం వలన కూడా కిడ్నీలు పాడవుతాయి.

ఉప్పులో సోడియం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉప్పుని తీసుకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉప్పును కూడా బాగా తగ్గించండి. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే చాలా రకాల సమస్యలు కలుగుతాయి. మాంసం తీసుకోవడం వలన కూడా కిడ్నీలలో మార్పులు వస్తాయి. మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం.

మూత్రపిండాలపై ఒత్తిడిని మాంసం కలిగిస్తుంది. అలాగే ఈరోజుల్లో చాలామంది ఆర్టిఫిషియల్ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. వాటి వలన కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. కిడ్నీ సమస్యలు వీటి వలన కలుగుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇలా శరీరానికి హాని చేసే వాటిని తీసుకుంటే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాలి.

Share
Admin

Recent Posts