Tingling In Feet : చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tingling In Feet : మ‌నంద‌రిని ఏదో ఒక సంద‌ర్భంలో తిమ్మిర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. క‌ద‌ల‌కుండా ఎక్కువ స‌మ‌యం ఒకేచోట కూర్చోవ‌డం వ‌ల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. న‌రాల‌పై ఒత్తిడి ప‌డ‌డం వ‌ల్ల ఇలా తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. తిమ్మిర్లు రావ‌డం చాలా స‌హ‌జం. ఇలా వ‌చ్చిన తిమ్మిర్లు కొద్ది స‌మ‌యం త‌రువాత వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రిలో తిమ్మిర్లు త‌రుచూ వ‌స్తూ ఉంటాయి. కాళ్లు, చేతులతో పాటు అరికాళ్లు, అరి చేతుల్లో కూడా తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. రోజుల త‌ర‌బ‌డి తిమ్మిర్లు వ‌స్తూనే ఉంటాయి. ఇలా త‌రుచూ వ‌చ్చే తిమ్మిర్ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. త‌రుచూ తిమ్మిర్లు రావ‌డానికి వెనుక అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వారు చెబుతున్నారు. తరుచూ తిమ్మిర్లు వ‌స్తూ ఉంటే అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నూ వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

త‌రుచూ తిమ్మిర్లు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ప్ర‌తి ఒక్క‌రు తెలుసుకోవ‌డం చాలా అవ‌సరం. తిమ్మిర్లు రావ‌డానికి గ‌ల ముఖ్య‌మైన కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల తిమ్మిర్లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. ర‌క్తంలో ఎక్కువ‌గా ఉండే చ‌క్కెర‌లు న‌రాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. అలాగే వెన్నెముక‌లో జారిన డిస్క్ కాళ్ల న‌రాలపై ఒత్తిడి చేయ‌డం వ‌ల్ల కూడా తిమ్మిర్లు ఎక్కువ‌గా వ‌స్తాయి. అలాగే రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్, ఆర్థ‌రైటిస్, ల్యూప‌స్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారిలో కూడా తిమ్మిర్లు ఎక్కువ‌గా వ‌స్తాయి. అంతేకాకుండా శ‌రీరంలో విట‌మిన్ బి, విట‌మిన్ ఇ లు లోపించ‌డం వ‌ల్ల కూడా తిమ్మిర్లు వ‌స్తాయి. అలాగే హెప‌టైటిస్ డి, సి వంటి ఇన్పెక్ష‌న్ ల‌తో బాధ‌ప‌డే వారిలో కూడా న‌రాల ఆరోగ్యం దెబ్బ‌తిని తిమ్మిర్లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి.

Tingling In Feet important facts to know
Tingling In Feet

అదే విధంగా మూత్ర‌పిండాల‌కు సంబంధించిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలొ, థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారిలో కూడా తిమ్మిర్లు ఎక్కువ‌గా వ‌స్తాయి. అలాగే వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడే వారిలో కూడా తిమ్మిర్లు త‌రుచూ వ‌స్తూ ఉంటాయి. ఈ విధంగా త‌రుచూ తిమ్మిర్లు రావ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉంటాయ‌ని త‌రుచూ తిమ్మిర్లు వ‌స్తూ ఉంటే అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts