Tomatoes And Sweet Potatoes : ఈ కూర‌గాయ‌ల‌ను అస‌లు క‌లిపి వండొద్దు.. తినొద్దు..!

Tomatoes And Sweet Potatoes : చాలా మంది భోజనం చేసేట‌ప్పుడు వివిధ ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్ల‌ను ట్రై చేస్తుంటారు. కొంద‌రు ప‌ప్పు, ప‌చ్చ‌డి తింటే కొంద‌రు ప‌ప్పులో నెయ్యి వేసి తింటారు. ఇంకొంద‌రు పప్పుచారులో ప‌ప్పు వేసి తింటారు. అయితే వాస్త‌వానికి కొన్ని ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్స్ మంచి రుచిని అందించే మాట నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం ఎప్ప‌టికీ క‌లిపి వండ‌కూడ‌దు. క‌లిపి తిన‌కూడ‌దు. ఈ క్ర‌మంలోనే అలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేష‌న్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటల్లో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌ చిలగ‌డ దుంపల్లో ఉంటాయిప‌ కార్బొహైడ్రేట్స్‌తో సిట్రిక్ యాసిడ్ కలిపి తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది. క‌నుక ట‌మాటాలు, చిల‌గ‌డ దుంప‌ల‌ను ఎప్ప‌టికీ క‌లిపి వండ‌రాదు. తిన‌రాదు. ఇక పండ్లు త్వ‌ర‌గా అరిగిపోతాయి. వీటిని భోజనంతో కలిసి తీసుకోవడం వల్ల భోజనంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు త్వరగా జీర్ణం కావు. కాబట్టి వాటితోపాటు పండ్లు కూడా జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది. క‌నుక‌ ఆలోపే పండ్లు కుళ్లిపోతాయి. దాని కారణంగా పేగులోని లోపలి పొర దెబ్బతింటుంది. అందువ‌ల్ల భోజ‌నం తిన్న వెంట‌నే లేదా తింటానికి ముందు పండ్ల‌ను తిన‌రాదు. క‌నీసం 2 గంట‌లు గ్యాప్ ఇచ్చి తినాలి.

Tomatoes And Sweet Potatoes do not cook them together
Tomatoes And Sweet Potatoes

ఇక మాంస ఉత్పత్తుల్లోని మాంసకృతులు, పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని సూక్ష్మ పోష‌కాలు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్‌ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది. అందువ‌ల్ల నాన్‌వెజ్‌ను, పిండి ప‌దార్థాల‌ను అధికంగా క‌లిపి తీసుకోరాదు.

ఇక పాల ఉత్పత్తులు సైనస్ లను మూసేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలి. ఇలా ఈ ఫుడ్ కాంబినేష‌న్ల‌ను తిన‌కుండా ఉంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Editor

Recent Posts