Tomatoes Benefits : మనం వంటింట్లో విరివిగా వాడే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలు ప్రతి ఒక్కరి వంటగదిలో తప్పకుండా ఉంటాయనే చెప్పవచ్చు. టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. టమాటాలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. టమాటాల ధర ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్న వీటిని మాత్రం కొనుగోలు చేయకుండా వాడకుండా ఉండలేరు. అలాగే టమాటాలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక్క టమాటాను తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే చాలా మంది వర్షాకాలంలో టమాటాలను తీసుకోరు. కానీ వర్షాకాలంలో కూడా టమాటాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టమాటాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని తీసుకునే విషయంలో చాలా మంది అనేక అపోహలు కలిగి ఉన్నారు.
షుగర్ వ్యాధి గ్రస్తులు అలాగే గర్భిణీ స్త్రీలు టమాటాలను తీసుకోకూడదని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. నిజంగా గర్భిణీ స్త్రీలు టమాటాలను తీసుకోకూడదా.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. టమాటాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. టమాటాలను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా టమాటాలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో టమాటాలు దోహదపడతాయి. అలాగే టమాటాలను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే టమాటాలల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కనుక వీటిని షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా తీసుకోవచ్చు. ఇక గర్భిణీ స్త్రీలు కూడా టమాటాలను తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ఫోలేట్ కూడా ఒకటి. ఇది గర్భస్థ శిశువు ఎదుగుదలలో ఎంతగానో తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలకు ఎంతో అవసరమైన ఈ ఫోలేట్ టమాటాలల్లో పుష్కలంగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు కూడా టమాటాలను ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఉపయోగించే ముందు శుభ్రంగా కడిగిన తరువాత మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.