Pomegranate Peel : దానిమ్మ పండ్లను తిన్నప్పుడు ఇకపై తొక్కలను పడేయకండి.. ఈ 8 అద్భుతమైన లాభాలను పొందవచ్చు..!

Pomegranate Peel : దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం బాగా తయారవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇంకా అనేక ప్రయోజనాలు మనకు దానిమ్మ పండ్ల వల్ల కలుగుతాయి. అయితే దానిమ్మ పండే కాదు, తొక్కల వల్ల కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఆ తొక్కలతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

top 8 health benefits of Pomegranate Peel

1. దానిమ్మ పండు తొక్కలో అద్భుతమైన ఔషధగుణాలు, పోషకాలు ఉంటాయి. విటమిన్‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్‌, విటమిన్‌ బి6, మెగ్నిషియం వంటివి దానిమ్మ పండు తొక్కలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

2. దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా సైంధవ లవణం, పుదీనా నూనె కలిపి పేస్ట్‌లా చేసి దాంతో రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారి మిలమిలా మెరుస్తాయి. పిప్పి పన్ను సమస్య నుంచి బయట పడవచ్చు. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి సమస్యలు పోతాయి.

3. కీళ్ల నొప్పులు ఉన్నవారికి దానిమ్మ పండు తొక్కలు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ తొక్కలను నీటిలో వేసి మరిగించి రోజూ తాగుతుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

4. దానిమ్మ పండు తొక్కలను దంచి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని వేసి కట్టులా కడుతుంటే.. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.

5. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి దాన్ని నీళ్లతో కలిపి ఫేస్‌ ప్యాక్‌లా తయారు చేసుకోవచ్చు. దాన్ని ముఖానికి రాసి 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది.

6. దానిమ్మ తొక్కలను ఆవనూనెతో కలిపి దంచి మిశ్రమంగా చేయాలి. అనంతరం దాని నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని వక్షోజాలపై రాత్రిపూట రాసి మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే వక్షోజాలు దృఢంగా మారుతాయి.

7. దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తుండాలి. దీంతో నోరు శుభ్రంగా మారి నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే నోట్లో ఉండే పొక్కులు, పుండ్లు తగ్గిపోతాయి.

8. రాత్రి నిద్రకు ముందు దానిమ్మ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే షుగర్‌, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

Editor

Recent Posts