Turmeric Milk : మనం ప్రతిరోజూ పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. పాలల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎముకలను ధృడంగా చేయడంలో, దంతాలు బలంగా చేయడంలో, ఒత్తిడిని తగ్గించడంలో పాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే పాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. పాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే సాధారణ పాలకు బదులుగా ఈ పాలల్లో పసుపును కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. పసుపును కూడా మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పసుపులో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో పసుపు మనకు ఎంతో సహాయపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పసుపును పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీంతో మనం తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగుపడడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అలాగే పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మం పైఉండే మచ్చలు తొలగిపోతాయి. బరువు తగ్గాలనుకునే వారు పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ పాలు, పసుపును ఎలా తీసుకోవాలి.. ఎంత మోతాదులో వాడాలి.. ఎప్పుడూ తాగాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ పాలల్లో పావు టేబుల్ స్పూన్ పచ్చి పసుపును లేదా ఆర్గానిక్ పసుపును కలపాలి. తరువాత ఈ పాలను పది నిమిషాల పాటు మధ్యస్థ మంటపై మరిగించాలి. తరువాత వీటిని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో బెల్లం లేదా తేనెను కలిపి తీసుకోవాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను లేదా బెల్లాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న పాలను రోజూ రాత్రి పడుకోవడానికి అర గంట ముందు తాగాలి. ఈ విధంగా పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.