హెల్త్ టిప్స్

Turmeric Tea : పసుపు టీని ఇలా తయారు చేసుకుని రోజూ తాగండి.. కేజీలకు కేజీల బరువు అలవోకగా తగ్గుతారు..

Turmeric Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా కూడా పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అనేక వ్యాధులను పసుపుతో మనం నయం చేసుకోవచ్చు. అయితే పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ తాగడం వల్ల అధిక బరువు ఇట్టే తగ్గుతారు. ఇక పసుపు టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు టీని తయారు చేసేందుకు గాను 6 టేబుల్‌ స్పూన్స్‌ పసుపు, ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల అల్లం పొడి, అంతే మోతాదులో మిరియాల పొడి అవసరం అవుతాయి. ఇప్పుడు పసుపు టీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి. దీని వల్ల ఈ పొడిని రోజూ తయారు చేయాల్సిన పని ఉండదు. ఒకసారి చేస్తే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.

turmeric tea many amazing wonderful health benefits

ఇక ఇలా తయారు చేసిన పొడిని అర టీస్పూన్‌ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్‌ నీటిలో వేసి మరిగించాలి. పది నిమిషాల పాటు నీటిని మరిగించాక స్టవ్‌ ఆఫ్‌ చేసి వడకట్టాలి. అనంతరం గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ టీని తాగేయాలి. ఇలా రోజూ పరగడుపున తాగాలి. అవసరం అనుకుంటే రాత్రి పడుకునే ముందు కూడా ఒక కప్పు మోతాదులో ఈ టీని తాగవచ్చు. అయితే దీన్ని ఎప్పుడు తాగినా కనీసం 30 నిమిషాల పాటు ఏమీ తీసుకోకూడదు.

ఇలా పసుపు టీ ని తయారు చేసి రోజూ తాగడం వల్ల పొట్ట భాగంలో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుంది. ఎంతటి బాన పొట్ట అయినా సరే దీంతో కరిగిపోతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. థైరాయిడ్‌ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతాయి. ఇలా పసుపు టీతో ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే దీన్ని గర్భవతులు, పాలిచ్చే తల్లులు డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts