వినోదం

Aparichitudu Movie : అప‌రిచితుడు మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా..?

Aparichitudu Movie : సాధార‌ణంగా ద‌ర్శ‌కులు ఫ‌లానా హీరోని ఊహించుకొని క‌థ రాసుకుంటారు. కాని ఆ హీరో ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్‌కి నో చెబితే ఇదే క‌థ‌ని వేరే హీరోతో చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. కాని ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. అప‌రిచితుడు టైటిల్ రాజ‌శేఖ‌ర్ నుండి విక్ర‌మ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అపరిచితుడు సినిమాను గుర్తు చేసుకోగానే ముందుగా మన ముందుకు వచ్చే హీరో విక్రమ్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005లో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా తెలుగులో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 13 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.

అయితే అపరిచితుడు అనే టైటిల్ విక్రమ్ కంటే ముందు మరో హీరో కోసం వాడుకోవాలని చూసారు. దానికి దర్శకుడు శ్రీను వైట్ల. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఒకప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో అపరిచితుడు సినిమా తెరకెక్కాల్సి ఉంది. అందులో రాజశేఖర్ హీరోగా నటించాలని అనుకున్నాడు. అపరిచితుడు అనే టైటిల్ ని ముందుగా టాలీవుడ్ యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ కోసం రిజిస్టర్ చేయించారు. 1994లో దర్శకుడు శ్రీనువైట్ల రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే సినిమాని చేద్దాం అనుకున్నాడు. 20% షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న‌ ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.

do you know who missed to do aparichitudu movie

తరువాత శ్రీనువైట్ల 1998లో “నీకోసం” అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలా రాజశేఖర్ చేయాల్సిన “అపరిచితుడు” అనే టైటిల్ తో సినిమా తీసి హిట్టు కొట్టాడు శంకర్. అంతే కాదు శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు సినిమాలు కూడా ముందుగా రాజశేఖర్ ని హీరోగా అనుకున్నవే. కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమాలు వేరే వాళ్ల చేతిలోకి వెళ్లాయి.

Admin

Recent Posts