Unpolished Cereals : నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. యుక్తవయసులోనే చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మనం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఏది పడితే అది తినడానికి కూడా ఉండదు. షుగర్ వ్యాధి బారిన పడడానికి ప్రధాన కారణం మారిన మన ఆహార నియమాలేనని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారాలన్నీ కూడా పాలిష్ పట్టిన ఆహారాలే. దీంతో అవి త్వరగా జీర్ణమయ్యి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తాయి. దీంతో మనం షుగర్ వ్యాధి బారిన పడాల్సి వస్తుంది.
అదే మనం పాలిష్ పట్టని ధాన్యాలను, పప్పు దినుసులను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి తగ్గడంతో పాటు లేని వారికి కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు పాలిష్ పట్టని ధాన్యాలను తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్లప్పుడూ చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పాలిష్ పట్టని ధాన్యాల యొక్క పై పొరల్లో ప్రోటీన్, ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ధాన్యాలను తీసుకున్నప్పుడు వాటిలోని ప్రోటీన్, కొవ్వు పదార్థాల కారణంగా అవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీంతో చక్కెరలు నెమ్మదిగా విడుదల అవుతాయి. అలాగే ఈ ధాన్యాలలో ఉండే ఫైబర్ విడుదలైన చక్కెరను నెమ్మదిగా రక్తంలో కలిసేలా చేస్తుంది. నెమ్మదిగా రక్తంలో కలిసిన ఈ చక్కెరను మనం మన శరీర అవసరాలకు తగినట్టు ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉంటాము.
కనుక రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. అదే మనం పాలిష్ పట్టిన ఆహారాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు అన్ని తొలగిపోతాయి. దీంతో అవి వేగంగా జీర్ణం అయ్యి చక్కెలు వేగంగా రక్తంలో కలుస్తాయి. విడుదలైన ఈ చక్కెరలను మనం వెను వెంటనే ఖర్చు చేయలేము కనుక రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో మనం షుగర్ వ్యాధి బారిన పడాల్సి వస్తుంది. కనుక షుగర్ వ్యాధితో బాధపడే వారు లేని వారికి రాకుండా ఉండాలన్నా మనం పాలిష్ పట్టని ఆహారాలనే తీసుకోవాలని మన ఆహార నియమాలను ముందు నుండే మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.