Water Purification : మున‌గ‌కాయ విత్త‌నాల‌తో మీరు తాగే నీటిని ఎంతో స్వ‌చ్ఛంగా, శుభ్రంగా ఇలా మార్చుకోండి..!

Water Purification : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో మున‌గ‌కాయ‌లు ఒక‌టి. మున‌గ ఆకులు ఎంత శ‌క్తివంత‌మైన‌వో.. మున‌గ‌కాయ‌లు కూడా అంతే శ‌క్తివంతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు, పోషకాలు దండిగా ఉంటాయి. అందువ‌ల్ల మున‌గ ఆకులు, కాయ‌ల‌ను వ‌ర‌ప్ర‌దాయినిగా చెప్ప‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే మున‌గ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాలతో నీటిని శుభ్రం చేసుకోవ‌చ్చనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అవును.. ఈ విత్త‌నాల‌తో రోజూ మ‌నం తాగే నీటిని శుభ్రం చేసుకుంటే.. అవి స్వ‌చ్ఛంగా మారుతాయి. దీంతో నీటి వ‌ల్ల మ‌నకు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే ఈ మున‌గ‌కాయ‌ల విత్త‌నాల‌తో నీటిని ఎలా శుభ్రం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Water Purification you can purify water with drumstick seeds here it is how to do it
Water Purification

మున‌గ‌కాయ‌ల నుంచి విత్త‌నాలను తీసి నీడలో ఎండ‌బెట్టాలి. అనంత‌రం వాటిపై ఉండే పొట్టును తీసేసి లోప‌లి విత్త‌నాన్ని బ‌య‌ట‌కు తీయాలి. ఇలా సేక‌రించిన విత్త‌నాల‌ను పొడి చేసుకోవాలి. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేయాలి. అందులో నుంచి 150 మిల్లీగ్రాముల మోతాదులో పొడిని తీసుకుని కొద్దిగా నీటిని క‌లిపి జ్యూస్‌లా చేయాలి. దాన్ని మ‌నం శుభ్రం చేయాల‌నుకునే నీటిలో పోయాలి. త‌రువాత 30 సెక‌న్ల పాటు బాగా క‌ల‌పాలి. అనంత‌రం పాత్ర‌ను అలాగే ఉంచాలి.

ఇలా ఆ పాత్ర‌ను గంట సేపు అలాగే క‌దిలించ‌కుండా ఉంచితే.. మనం క‌లిపే పొడి అడుగు భాగంలో చేరుతుంది. పైన స్వ‌చ్ఛ‌మైన నీరు వస్తుంది. పైన ఉండే నీటిని సేక‌రించి పక్క‌న పెట్టుకోవాలి. ఆ నీరు చాలా శుభ్రంగా ఉంటుంది. మ‌నం తాగే నీటిలో ఉండే కాలుష్య కార‌కాలు, వ్య‌ర్థాలు, సూక్ష్మ క్రిములు మొత్తం ఆ పాత్ర‌కు అడుగు భాగంలో చేరి ఉంటాయి. క‌నుక పైన ఉండే నీరు చాలా స్వ‌చ్ఛంగా ఉంటుంది. దాన్ని సేకరించి తాగాలి. ఈ నీరు చాలా శుభ్రంగా ఉంటుంది క‌నుక మ‌న‌కు నీటితో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.

సాధారణంగా మ‌నం ఎంత శుభ్ర‌మైన నీటిని తాగుదామ‌నుకున్నా.. అందులో ఎంతో కొంత వ్య‌ర్థాలు, క్రిములు ఉంటాయి. కానీ ఈ విధంగా మున‌గ కాయ‌ల విత్త‌నాల‌తో నీటిని శుభ్రం చేస్తే ఆ నీరు చాలా స్వ‌చ్ఛంగా మారుతుంది. కనుక నీటిని ఇలా శుభ్రం చేసుకుని రోజూ తాగ‌వ‌చ్చు. మున‌గ‌కాయ‌ల విత్త‌నాల్లో యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ వైర‌ల్, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక‌నే ఆ విత్త‌నాలు నీటిని శుభ్రం చేసేందుకు శ‌క్తివంతంగా పనిచేస్తాయి. ఇక 150 మిల్లీగ్రాముల మున‌గ‌కాయ విత్త‌నాల పొడితో 1 లీట‌ర్ నీటిని శుభ్రం చేయవ‌చ్చు. అందుకు అనుగుణంగా పొడిని సిద్ధం చేసుకుని రోజూ ఉప‌యోగించ‌వ‌చ్చు.

Admin

Recent Posts