హెల్త్ టిప్స్

కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా …!

భారతీయ వంటలలో సాధారణంగా కరివేపాకును సువాసన కోసమే వాడతారని మాత్రమే మనకు తెలుసు. కాని కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగించబడుతుంది. కరివేపాకు యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ వంటి ఆక్సిడెంట్ లు ఉండటం వల్ల గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్ లు,డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుతుంది. ఇవే కాక కరివేపాకు లో ఉన్న విటమిన్ ల‌ వల్ల ఇంకా అనేక వ్యాధులకు మంచి ఔషధం లా పనిచేస్తుంది.

ఒక స్పూన్ కరివేపాకు రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి దానిలో కొద్దిగా పంచదార కూడా వేసి తాగితే వాంతులు, వికారం, నోటి మూలాలు పగులుట, నరముల బలహీనతకు చక్కని ఔషధం లా పని చేస్తుంది. విరోచనాలు, మొలల సమస్య తో బాధ పడేవారు లేత కరివేపాకుని తేనె తో కలిపి తింటే ఉపసమనం కలుగుతుంది. లేత కరివేపాకు తో చేసిన కషాయం తాగితే ఎటువంటి జ్వరం అయినా తగ్గుతుంది. ప్రతి రోజు పది కరివేపాకులను తింటుంటే షుగర్ వ్యాధి రాదు.

we must take curry leaves for these uses

కరివేపాకులో పైబర్ అధికంగా ఉండ‌డం వల్ల ఇది రక్తంలో చక్కర స్థాయిల‌ని నియంత్రిస్తుంది. కరివేపాకు రసాన్ని రెండు చుక్కలు కళ్ళలో వేసుకుంటే శుక్లాలు పెరగవు. బాగా పండిన కరివేపాకు చెట్టు కాయలు నిమ్మరసంతో కలిపి నూరి గజ్జి వంటి చర్మ వ్యాధులపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.ఎన్నో వ్యాధులకు చక్కటి మందుగా ఉపయోగపడే కరివేపాకు తినడం వల్ల కంటికి మంచిది.

Admin
Published by
Admin
Tags: curry leaves

Recent Posts