Weight Loss Drink : రోజూ దీన్ని తాగితే అధిక బ‌రువు ఇట్టే తగ్గుతారు.. కొవ్వు ఉండ‌దు..

Weight Loss Drink : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య నేటి త‌రుణంలో రోజురోజుకూ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి మ‌నం ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డాలి. లేదంటే షుగర్, బీపీ, గుండె జ‌బ్బులు వంటి అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఈ అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం.

ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం, వ్యాయామం చేయ‌డం, వాకింగ్ చేయ‌డం వంటి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అధిక బ‌రువును త‌గ్గించే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం బిర్యానీ ఆకుల‌ను, దాల్చిన చెక్క‌ను, జీల‌క‌ర్ర‌ను, యాల‌కుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ పానీయం కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక లీట‌ర్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక రెండు బిర్యానీ ఆకుల‌ను, 2 యాల‌కుల‌ను క‌చ్చా ప‌చ్చాగా దంచుకుని వేసుకోవాలి. త‌రువాత ఒక ఇంచు దాల్చిన చెక్క‌ను, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను వేసి బాగా మ‌రిగించాలి.

Weight Loss Drink prepare in this way and take daily that works
Weight Loss Drink

నీళ్లు మ‌రిగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మూత పెట్టి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న క‌షాయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవాలి. ఈ పానీయాన్ని ఈ విధంగా 45 రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల మన శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. దీంతో మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు షుగ‌ర్ కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. జీర్ణ‌క్రియ మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ దినుసుల్లో ఉండే ఔష‌ధ గుణాలు మ‌న‌ల్ని రోగాల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts