Weight Loss Tips : వ్యాయామం లేకుండా శరీర బరువు తగ్గాలా.. అయితే ఈ పద్ధతులను పాటించాల్సిందే..!

Weight Loss Tips : ప్రస్తుత కాలంలో తింటున్న ఆహారపదార్థాలకు అనుగుణంగా చాలా మంది అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో కఠిన వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా వ్యాయామాలు చేసినప్పటికీ శరీర బరువు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఎలాంటి వ్యాయామం లేకుండా శరీర బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సిందే.

Weight Loss Tips lose you weight without exercise in this way

1. సాధారణంగా మనం అన్నం తినేటప్పుడు కొన్నిసార్లు నమలకుండా తినేస్తాము. ఇలా తినటం వల్ల అధిక శరీర బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక శరీర బరువు తగ్గాలనుకునేవారు అన్నం బాగా నమిలి తినాలి.

2. శరీర బరువు తగ్గాలనుకునేవారు ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉంటూ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గుతారు.

3. మన శరీరానికి కావలసినంత నీటిని తీసుకోవటం వల్ల త్వరగా శరీర బరువు తగ్గవచ్చు. అయితే భోజనం చేయడానికి ముందు, చేసిన తరువాత కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండాలి. దీంతో శరీర బరువును తగ్గించుకోవచ్చు.

4. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియలు వేగవంతం అవుతాయి. కనుక ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడంతో శరీర బరువును తగ్గించుకోవచ్చు.

5. చాలామంది ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతారు. కనుక కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.

Share
Sailaja N

Recent Posts