హెల్త్ టిప్స్

నెయ్యి మంచిదే.. తిన‌డం మరిచిపోకండి..!

ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ నెయ్యి, కొద్దిగా ప‌సుపు , మిరియాలు వేసి తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒత్తిడి త‌గ్గి మంచి నిద్ర ప‌డుతుంది. నెయ్యి జీవ‌క్రియ‌ల రేటును మెరుగు ప‌రిచేలా చేస్తుంది. ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ను పెంచుతుంది. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రో బ‌యోటిక్ ఫుడ్‌గా ప‌నిచేసి పేగుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నెయ్యిలో విట‌మిన్ కె2 స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఎముక‌లు క్యాల్షియంను గ్ర‌హించ‌డానికి ఇది స‌హాయ‌ప‌డుతుంది. కీళ్ల నొప్పులు త‌గ్గేందుకు ఉప‌క‌రిస్తుంది. 5 గ్రాముల నెయ్యిలో 44.8 క్యాల‌రీలు, 4.9 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి.

what are the benefits of having ghee daily

డ‌యాబెటిస్‌, ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు నెయ్యిని తీసుకోవాలి. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు 1 టీస్పూన్ మేర నెయ్యి తిన‌వ‌చ్చు. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి.

Admin

Recent Posts