హెల్త్ టిప్స్

Onion : ఉల్లిపాయను కోసి చాలా సేపు ఉంచితే.. విషంగా మారుతుందా..?

Onion : ఉల్లిపాయ అందరి వంటింటిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఉల్లిపాయలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని పెద్దలు చెబుతుంటారు. ఉల్లిపాయ కోసినప్పుడు కంటి నుంచి నీరు వచ్చినా ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. నిత్యం ఉల్లిపాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.

వీటితో పాటు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతాయి. చాలామంది ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఉల్లిపాయతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఉల్లిపాయలో ఉండే ఘాటైన వాసన కారణంగా, ఉల్లిపాయను సగానికి కోసి ఆలా ఉంచితే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. అందువల్ల కోసి ఆలా ఉంచిన ఉల్లిపాయలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి.

what happens if cut onions stays long

ఈ ఉల్లిపాయను తిన్నప్పుడు దానిలో ఉండే బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి కడుపునొప్పి మరియు ఇన్ఫెక్షన్స్ కి కారణం అవుతుంది. అయితే ఉల్లిపాయను కోసిన ఒకరోజు తర్వాత ఈ విధంగా జరుగుతుందట. అందువల్ల అవసరం అయినప్పుడు ఉల్లిపాయ కోసుకుంటే సరిపోతుంది. కానీ మరొక వాదన కూడా ఉంది. కొంతమంది ఉల్లిపాయకు ఉన్న ఘాటైన వాసన కారణంగా త్వరగా బ్యాక్టీరియా చేరదని అంటారు. అయితే కోసే సమయంలోను, నిల్వ చేసే సమయంలోను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుందట. ఉల్లిపాయ మాత్రమే కాదు ఎలాంటి ఆహారాన్ని అయినా శుభ్రమైన వాతావరణంలో ఉంచాలి.

Share
Admin

Recent Posts