Smoke Behind Rockets : ఆకాశంలో రాకెట్లు, విమానాలు వెళ్లేటప్పుడు ఎవరైనా సహజంగా వాటి వైపు చూస్తారు. అయితే అక్కడే మనం గమనించాల్సిన విషయం కూడా ఇంకోటి ఉంది. అదేమిటంటే.. అవి వెళ్తున్నప్పుడు వాటి వెనుక తెల్లని మేఘాలు వచ్చినట్టు మనకు కనిపిస్తాయి కదా. అయితే నిజానికి అవి మేఘాలు కావు. మరి ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
రాకెట్లు, విమానాలు ఆకాశంలో వెళ్తున్నప్పుడు వాటి వెనుక నుంచి వచ్చేది పొగ మాత్రమే. కానీ అది మేఘంగా మారుతుంది. అందుకే అది మనకు మేఘంలా కనిపిస్తుంది. అయితే అది నిజానికి అసలైన మేఘం కాదు. రాకెట్లు, విమానాల పొగ వల్ల అది ఏర్పడుతుంది. వాటి పొగ గొట్టాల్లో ఎరోసోల్స్ అని పిలవబడే ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. అవి పొగ ద్వారా బయటికి వస్తాయి. అవి అలా రాగానే గాలిలో ఉండే నీటి బిందువులు వాటి చుట్టూ చేరుతాయి. ఈ క్రమంలో అవి మేఘాల్లా మారుతాయి. అంతే కానీ, అవి నిజమైన మేఘాలు కావు. అయితే ఈ మేఘాలు సహజంగా 3 రకాలుగా ఉంటాయి.
ఒక రకమైన మేఘాలు అప్పుడే ఏర్పడి అప్పటికప్పుడే మాయమవుతాయి. రెండో రకమైన మేఘాలు సన్నగా ఉండి చాలా సేపటి వరకు అంటే రాకెట్ లేదా విమానం వెళ్లి చాలా సేపు అయినాక కూడా అవి అలాగే ఉంటాయి. ఇక మూడో రకం మేఘాలు ఎలా ఉంటాయంటే రెండో రకం లాగే ఉంటాయి. కానీ అవి చాలా దట్టంగా, విశాలంగా ఉంటాయి. ఇదీ.. రాకెట్లు, విమానాల వెనుక ఏర్పడే మేఘాల అసలు కథ..!