మీరు మీ యూరిన్ మీరు తాగితే, దానిలోని విషపూరిత పదార్థాలు మీ శరీరంలోకి తిరిగి చేరతాయి. ఇది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. యూరిన్‌లోని కొన్ని విషపూరిత పదార్థాలు. అమ్మోనియా, యూరియా, క్రియేటినిన్, యూరిక్ ఆమ్లం. ఈ పదార్థాలు మీ శరీరంలోని కణాలను దెబ్బతీయగలవు. అవి మీ మూత్రపిండాలు, గుండె, శ్వాసకోశ వ్యవస్థకు కూడా హాని కలిగించవచ్చు. మరణము సంభవించ వచ్చు.
అమెరికాలోని కొలరాడో కు చెందిన 53 ఏళ్ల క్యారీ తన మూత్రాన్ని తానే తాగడానికి ఇష్టపడుతుందని నివేదిక వెల్లడించింది. ఇది మాత్రమే కాదు.. ఆమె గత నాలుగేళ్లుగా ఇలా చేస్తోందని పేర్కొంటున్నారు. అయితే.. నీరు తాగడానికి బదులుగా.. ఆమె తన మూత్రాన్ని నిల్వ ఉంచి మరి తాగుతున్నట్లు క్యారీ వెల్లడించింది. క్యారీకి ఉన్న ఈ వింత వ్యసనం గురించి తెలిసుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు.
ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. క్యారీ రోజులో కనీసం 5 గ్లాసుల మూత్రం తాగుతుందట. ఇలాంటి పరిస్థితిలో.. ఆమె మూత్రం తాగడాన్ని అంచనా వేస్తే.. ఆమె గత 4 సంవత్సరాలలో 3400 లీటర్ల కంటే ఎక్కువ మూత్రం తాగినట్లు నివేదిక వెల్లడించింది. అయితే స్వమూత్రపానం అన్నది ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. అంతేకానీ ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని కోరుతున్నారు.