హెల్త్ టిప్స్

Curry leaves powder benefits : కరివేపాకు పొడితో ఎన్నిలాభాలో తెలుసా..!

Curry leaves powder benefits : మన భారతీయ వంటకాలలో ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. సాధారణంగా వంట రుచిగా ఉండడానికి కరివేపాకును ఉపయోగిస్తుంటారు. కరివేపాకును కేవలం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము అనుకుంటే మాత్రం పొరపాటే. కరివేపాకు రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు కరివేపాకు నుంచి లభిస్తాయి. కరివేపాకు ఆకులు, కాయలు, వేరు బెరడు, కాండం బెరడు ఇలా అన్నింటిని ఔషధ రూపంలో వాడతారు.

కరివేపాకు కాలేయం మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు.. బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. పరగడుపునే ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ మనలో చాలామంది కరివేపాకు ఆహారంలో తగిలితే వెంటనే తీసి పక్కన పెట్టేస్తారు. పచ్చి కరివేపాకును తినడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు కరివేపాకును పొడి చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎవరు కూడా కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు కోల్పోకూడదు అనుకుంటే ఇప్పుడు చెప్పే విధంగా పొడి చేసుకొని ఆహారం ద్వారా తినిపించవచ్చు. ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం.

what happens if you take curry leaves powder daily

మొదట పాన్ స్టాప్ పై పెట్టి అందులో నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర పచ్చిశనగపప్పు, మిరియాలు, చింతపండు వేసి చిన్న మంట మీద వేయించాలి. వేయించిన ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తరువాత అందులో కరివేపాకు, ఇంగువ వేసి కరివేపాకు బాగా వేగేవరకు వేయించాలి. కరివేపాకును ముట్టుకుంటే విరిగిపోయేంత వరకు వేయించుకోవాలి. వేయించిన ఈ మిశ్రమం చల్లారిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి.

ఇక పిల్లలు తినే అన్నంలో కరివేపాకును తీసి పక్కన పడేస్తారు అనే భయం లేకుండా వుండాలంటే.. అన్ని కూరల్లో కరివేపాకు పొడి చేసి వేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసిన కరివేపాకు పొడిని చక్కగా స్పూన్ నెయ్యి వేసి అన్నంలో కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలు. పిల్లలలో ఆకలి పెరగడంతోపాటు అజీర్ణ సమస్య కూడా తగ్గుతుంది.

Admin

Recent Posts