గర్భిణి స్త్రీలు అధికంగా విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన పుట్టబోయే పిల్లల్లో ఫుడ్ అలెర్జీలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువలన గర్భిణి స్త్రీలు అధికంగా విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు.
వాషింగ్టన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో గర్భీణి స్త్రీల రక్తంలో ఎక్కువ స్థాయిలో డి విటమిన్ ఉన్నవారికి పుట్టిన బిడ్డలకు మొదట రెండు సంవత్సరాలు అధికంగా ఫుడ్ అలెర్జీలు వచ్చాయని. తక్కువ స్థాయి డి విటమిన్ ఉన్న వారికి పుట్టిన బిడ్డలలో కొన్ని సందర్భాలలో మాత్రమే ఫుడ్ అలెర్జీలతో బాధపడ్డారని వారు వివరించారు.
అందువలన మధ్యాహ్నం సూర్యకాంతికి దూరంగా ఉండాలి, బయట ఎక్కువ సమయం గడపకూడదు. ముఖ్యంగా గుడ్డులో ఉన్న తెల్లని పదార్థం, పాలు, గోధుమ పిండితో తయారు చేసిన ఆహారాలు, వేరుశెనగ లేదా సోయా చిక్కుళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. ఇటువంటి ఆహారాన్ని విస్మరించడం మంచిది.