Bathing : ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో స్నానం ఎంతో ముఖ్యం. కానీ చాలా మంది ఆ స్నానాన్ని ఏదో పనిలా చేస్తూ ఉంటారు. కానీ నిజానికి స్నానాన్ని అరగంట సేపైనా చేయాలి. ముందుగా శరీరాన్ని నీటితో బాగా తడిపి సున్ని పిండి వంటి వాటితో శరీరాన్ని రుద్దుకుని ఆ తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. స్నానం చేసిన తరువాత శుబ్రంగా తడుచుకోకపోయిన కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరిగ్గా తుడుచుకోకపోవడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మర్మంగాల వద్ద సరిగ్గా గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రాంతంలో సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
కాబట్టి శుభ్రంగా స్నానం చేసి ఆ తరువాత శరీరాన్ని శుభ్రంగా తడుచుకుని శుభ్రమైన దుస్తులు ధరించాలి. స్నానం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.తెల్లవారు జామున 4 గంటలకు చేసే స్నానాన్ని ముని స్నానం అంటారు. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. స్త్రీలు శరీరంపై ఏమి లేకుండా స్నానం చేయాలి. పురుషులు ఏదో ఒక వస్త్రాన్ని చుట్టుకుని స్నానం చేయాలి. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దైవ స్నానం అంటారు. 6 నుండి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఆ పై చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. చన్నీటితో స్నానం చేయడం ఎంతో మంచిది. నది స్నానం అన్నింటి కంటే ఉత్తమమైనది. చెరువు స్నానం మధ్యమమైనది. నూతి స్నానం అధమం.
ఇది అంతా కూడా ఈ రోజుల్లో అసాధ్యం. ఆచారాలు, పట్టింపులు లేని రోజులివి. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడం కూడా కష్టమే. అందుకే ప్రస్తుత రోజుల్లో మనం స్నానం చేసే పద్దతిని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈ పద్దతుల్లో స్నానం చేయడం వల్ల ఆరోగ్యమే కాదు నిత్య యవ్వనంగా కూడా ఉండవచ్చు. దీనికోసం ఆలివ్ నూనెను వేడి చేసి దానికి ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. తరువాత గుప్పెడు గులాబి రేకులను వేసి మరిగించిన నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వేప, పుదీనా, తులసి ఆకులను వేడి నీటిలో వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి.
సమపాళ్లల్లో వేడి చేసిన కొబ్బరి నూనె, ఆలివ్ నూనెలను తలకు పట్టించాలి. తరువాత వేడి నీటితో తడిపి నీళ్లు పిండేసిన టవల్ ను తలకు చుట్టుకోవాలి. తరువాత మెంతి పొడి, పెరుగుల మిశ్రమాన్ని తలకు రాసి అర గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటిలో పావు కప్పు కొబ్బరి పాలు, 2 చుక్కల రోజ్ ఆయిల్ ను వేసి ఆ నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల శరీరంతో పాటు మనసు కూడా తేలికపడుతుంది. అలాగే ఒక బకెట్ వేడి నీళ్లల్లో గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ ను వేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల నొప్పులు, అలసట నుండి ఉపశమనం పొందవచ్చు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రోగాలతో పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.