వీగన్ డైట్‌కు ప్రస్తుతం బాగా పాపులారిటీ పెరుగుతోంది. చాలా మంది సెలబ్రిటీలే కాదు, దీన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. అయితే ఇంకా చాలా మందికి ఈ డైట్ గురించి తెలియదు. వీగన్ డైట్ అంటే.. కేవలం శాకాహారాలను మాత్రమే తీసుకోవాలన్నమాట. జంతు సంబంధ పదార్థాలను అస్సలు తీసుకోరాదు. గుడ్లు, పాలు, మాంసం, చీజ్, వెన్న లాంటి జంతు సంబంధ పదార్థాలను తీసుకోరు. దీన్నే వీగన్ డైట్ అంటారు. ఇందులో ఎక్కువగా కూరగాయలనే తీసుకుంటారు.
వీగన్ డైట్‌లో సీడ్స్, నట్స్, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ ను కూడా తింటారు. ఈ డైట్‌లో భాగంగా చాలా వరకు పోషకాలు కూరగాయల నుంచే వస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీగన్ డైట్‌ను పాటించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వీగన్ డైట్‌లో భాగంగానే శాకాహారాలు అన్నింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. హైబీపీ తగ్గుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
2. వీగన్ డైట్‌లో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. కనుక శరీరంలో కొవ్వు చేరుతుందనే భయం పెట్టుకోవాల్సిన పనిలేదు. దీని వల్ల గుండె జబ్బులు రావు. ఆరోగ్యంగా ఉంటారు.
3. వీగన్ డైట్ వల్ల అధిక బరువును వేగంగా తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
4. ఈ డైట్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
అయితే వీగన్ డైట్ వల్ల మనకు విటమిన్ బి12, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు తక్కువగా లభిస్తాయి. కనుక ఈ డైట్‌ను కేవలం కొన్ని రోజుల పాటు చేసి అనుకున్న ఫలితాలు వచ్చాక మానేయవచ్చు. మళ్లీ కొన్ని రోజుల తరువాత మళ్లీ కొనసాగించవచ్చు. అలా వీగన్ డైట్‌ను పాటించవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.