హెల్త్ టిప్స్

వ‌ర్షంలో త‌డిచాక ద‌గ్గు, జ‌లుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వ‌ర్షంలో త‌డిస్తే ఆ ముప్పు ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. క‌చ్చితంగా జ‌లుబు, ద‌గ్గు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎవ‌రైనా స‌రే వ‌ర్షంలో త‌డిచి వ‌చ్చాక ఆయా స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే కింద చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే..

drenched in rain then follow these tips to not get cold and cough

1. వ‌ర్షంలో త‌డిచి ఇంటికి వ‌చ్చాక వెంట‌నే దుస్తుల‌ను మార్చుకుని వేడి నీళ్ల‌తో స్నానం చేయాలి. దీని వ‌ల్ల సూక్ష్మ క్రిములు శ‌రీరం లోప‌లికి చేర‌కుండా ఉంటాయి. అలాగే స్నానం చేసేవ‌ర‌కు ఎవ‌రినీ తాకరాదు. లేదంటే సూక్ష్మ క్రిములు ఇత‌రుల‌కు వ్యాప్తి చెందుతాయి.

2. వ‌ర్షంలో త‌డిచి వ‌చ్చాక క‌చ్చితంగా త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు రాకుండా నివారించ‌వ‌చ్చు.

3. వ‌ర్షంలో త‌డిచి వ‌చ్చిన వారు గ్రీన్ టీ లేదా డికాష‌న్ తాగాలి. అల్లం, మిరియాల‌ను నీటిలో వేసి మ‌రిగించి అందులో కొద్దిగా తేనె, తుల‌సి ఆకుల ర‌సం, నిమ్మ ర‌సం క‌లిపి తాగాలి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ద‌గ్గు, జ‌లుబు రాకుండా చూస్తుంది.

4. వ‌ర్షంలో త‌డిచి వచ్చిన వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం లేదా హిమాల‌య‌న్ సాల్ట్‌ను క‌లిపి స్నానం చేస్తే మంచిది. దీని వ‌ల్ల శ‌రీరంపై ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు న‌శిస్తాయి.

5. వ‌ర్షంలో బాగా త‌డిచిన వారు 2-3 రోజుల వ‌ర‌కు హెర్బ‌ల్ టీల‌ను తాగుతుండాలి. అల్లం, మిరియాలు, ప‌సుపు, తేనె, నిమ్మ‌ర‌సం వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇవి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి.

Share
Admin

Recent Posts