Cinnamon : మ‌హిళ‌లు దాల్చిన చెక్క‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Cinnamon : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దాల్చిన చెక్క‌ను ఎంతో కాలంగా మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే దాల్చిన చెక్క‌లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ముఖ్యంగా స్త్రీల‌కు దాల్చిన చెక్క మ‌రింత‌గా మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన చెక్క‌కు హార్మోన్ల‌ను నియంత్రించే గుణం ఉంటుంది. గ‌ర్భాశ‌యంలో ర‌క్త‌ప్ర‌వాహాన్ని పెంచి రుతుచ‌క్రాన్ని నియంత్రించ‌డంలో దాల్చిన చెక్క స‌హాయ‌ప‌డుతుంది.

దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల నెల‌స‌రి స‌క్ర‌మంగా వ‌స్తుంది. అలాగే నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పి కూడా త‌గ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పిసిఓఎస్( పాలిసిస్టిక్ ఓవ‌రీ సిండ్రోమ్) ల‌క్ష‌ణాలు త‌గ్గుతాయి. పిసిఓఎస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే స్త్రీల‌ల్లో నెల‌సరి స‌క్ర‌మంగా వ‌స్తుంది. దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సెటివిటీ మెరుగుప‌డుతుంది. దాల్చిన చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే దీనిలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల ప‌నితతీరు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌నాళాల్లో ఉండే ఇన్ ప్లామేష‌న్ తగ్గుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

women must take Cinnamon daily know about it
Cinnamon

గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే స్త్రీలు దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో జీవ‌క్రియ‌ల వేగం పెరుగుతుంది. వ్యాయామం చేసే వారు దాల్చిన చెక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. వారి శరీర బ‌రువు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటుంది. దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ కూడా మెరుగుప‌డుతుంది. క‌డుపులో అసౌక‌ర్యం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే స్త్రీలు దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి. వారిలో సంతానోత్ప‌త్తి రేటు మెరుగుప‌డుతుంది. ఈ విధంగా దాల్చిన చెక్క స్త్రీల‌కు మ‌రింత‌గా మేలు చేస్తుంద‌ని దీనిని వంట‌లు, సూప్స్ వంటి వాటిలో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts