మనలో చాలా మందిని గ్యాస్ ట్రబుల్ సమస్య వేధిస్తూ ఉంటుంది. తినేటప్పుడు సంతోషంగా తిన్నప్పటికి తిన్న తరువాత ఈ సమస్య ఎంతగానో వేధిస్తుంది. గ్యాస్ సమస్య కారణంగా మనం ఎంతో ఇబ్బందికి గురి కావాల్సి ఉంటుంది. దీని వల్ల రోజంతా పని సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటాము. అలాగే గ్యాస్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. కొందరు కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడితే మరికొందరు మలం ప్రేగులో గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది మలం ప్రేగులో గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా గ్యాస్ సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల మంచి అలవాట్లను నేర్చుకోవడం వల్ల ఆ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సమస్యతో బాధపడే వారు ముందుగా మలం ప్రేగులో మలం నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
మలం ప్రేగు శుభ్రంగా లేకపోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దీంతో మనం తీసుకున్న ఆహారాలు పులిసి గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కనుక మలం ప్రేగు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున లీటరుంపావు గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. సుఖ విరోచనం అవుతుంది. అలాగే ఒక గంట సమయం తరువాత మరలా లీటరుంపావు నీటిని తాగి మరలా రెండోసారి మలవిసర్జన అయ్యేలా చూసుకోవాలి. ఇలా రెండు సార్లుమలవిసర్జన అయ్యేలా చూసుకోవడం వల్ల మలం ప్రేగు శుభ్రంగా ఉంటుంది. ఇలా చయేడం వల్ల గ్యాస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు నీటిని తాగరాదు. ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత నీటిని తాగాలి. చాలా మంది భోజనం, అల్పాహారం తీసుకుంటూ నీటిని తాగుతారు.
ఇలా తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఆహారం ఇలా నిల్వ ఉండడం వల్ల గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది. కనుక తినేటప్పుడు నీటిని తాగకూడదు. ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అదే విధంగా రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. చాలా మంది భోజనానికి భోజనానికి మధ్యలో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆహారం జీర్ణం అవ్వకుండా మరలా ఆహారాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది. కనుక రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఉదయం పూట, సాయంత్రం పూట పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
గ్యాస్ సమస్య తగ్గే వరకు ఇలా రెండు పూటలా పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మరలా గాడిలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం 7 గంటలలోపు ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రాత్రంతా పొట్ట, ప్రేగులు ఖాళీగా ఉంటాయి. దీంతో గ్యాస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఈ విధంగా ఈ మంచి అలవాట్లను చేసుకోవడం వల్లరెండు రకాల గ్యాస్ సమస్య నుండి చాలా సులభంగా సహజ సిద్దంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.