హెల్త్ టిప్స్

మైగ్రేన్ ఉన్న‌వారు క‌చ్చితంగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు..!

మైగ్రేన్ తలనొప్పి బాధపడేవారు కేవలం వైద్యుల సలహాలతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అప్పుడే సమస్య నియంత్రణలో ఉంటుంది. వైద్యుల సలహా మేరకు మందులు వాడటం… నొప్పి భాధించనప్పుడు కూడా ఆహార, ఇతర నియమాలు పాటించడం మేలు. అలానే కొందరు ఈ సమస్యను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లోనే సొంత ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వారు వైద్య నిపుణుల సలహా పాట్టించడం మేలు.

వాతవరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ సమస్య మరింత రెట్టింపవుతుంది. అలాంటప్పుడు బయటకు రాకుండా వుండటం… చెవుల్లోకి చల్లని గాలి పోకుండా దూది పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ సమయంలో బాగా నిద్రపోవడం వల్ల ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఉదయం నడకతోపాటు యోగా, వ్యాయామం కూడా చేయమన్నది నిపుణుల సలహా.

you must follow these health tips if you have migraine

ఆహార నియమాల పట్ల శ్రద్ధ పెట్టాలి. ఉపవాసాలకూ దూరంగా ఉండాలి. అలానే ఒక్కపూట భోజనం కాకుండా కడుపు నిండా తినడం… పోషకాహారానికి ప్రాధాన్యమివ్వడం వంటివి చేయాలి. ఘాటైన పరిమళద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఎండలో బయటకు రాకుండా ఉండాలి. ఒకవేళ రావల్సి వస్తే చలువ కళ్లదాలు పెట్టుకోవాలి.

Admin

Recent Posts