చిట్కాలు

మీ లైంగికసామర్థ్యం పెర‌గాల‌ని అనుకుంటున్నారా..? అయితే దీన్ని తీసుకోండి..!

అశ్వగంధ..ఆయుర్వేదంలో అత్యంత ప్రసిద్ధ మూలకం. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. శారీరక అలసట, శారీరక ఒత్తిడి, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. లైంగికసామర్థ్యం పెంచేందుకు అశ్వగంధ ఎంతో ఉపయోగపడుతుంది. నిద్రను మెరుగుపరచడంతోపాటు ఏడీహెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌), పార్కిన్సన్‌లాంటి నాడీ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది.

ఇది గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి ప్రభావాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కొలెస్ట్రాల్, ధమనులలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అశ్వగంధ సహజ యాంటీఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్ నష్టంతో పోరాడగలదు. వృద్ధాప్య ప్రక్రియను (ఏజింగ్‌ ప్రాసెస్‌) నెమ్మదిస్తుంది. ఇన్సులిన్ స్రావం, ఇన్సులిన్ సెన్సివిటీని పెంచడం ద్వారా డయాబెటిక్, ఆరోగ్యకరమైన వ్యక్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అశ్వగంధ సహాయపడుతుంద‌ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

men who want to increase their sexual stamina take this

అశ్వగంధ సాంప్రదాయకంగా పురుషులలో అంగస్తంభన, ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. పరిశోధన అధ్యయనాలు అశ్వగంధ పురుషులలో మొత్తం స్పెర్మ్‌కౌంట్‌, టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి. ఇది స్త్రీ, పురుషులలో సెక్స్ డ్రైవ్, లైంగిక పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో తేలింది. అశ్వగంధ వేరు పౌడర్‌ను వేడి నీళ్లు, పాలు లేదా తేనెలో కలిపి తీసుకోవచ్చు.

Admin

Recent Posts