హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా..? అయితే పండ్ల‌ను ఎక్కువ‌గా తినండి..!

ఆరోగ్యదాయకంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజంతా వివిధ రకాల ఫ్రూట్స్ సలాడ్స్ ద్వారా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాజా కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, మాంసం, చేపలు, కోడిగుడ్లు వంటివి తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం చాలా సులభమని డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ రూల్స్ ఇన్ ది డస్ట్ అనే పుస్తక రచయిత డియాన్ గ్రీసెల్ తెలిపారు.

అల్పాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం, లంచ్, డిన్నర్‌లకు మధ్య ఫ్రూట్ స్నాక్స్ వంటివి తీసుకోవడం మంచి ఫలితమిస్తుంది. సలాడ్లు లేదా తాజా పండ్లను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని గ్రీసెల్ చెప్పారు.

if you want to reduce weight then take fruits daily

గ్లూకోజ్ గల ఆహారాన్ని ప్రతి మూడు లేదా నాలుగు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఐదు గంటలకు పైగా ఏవీ తీసుకోకుండా కడుపును ఖాళీగా ఉంచడం కూడదు. ఇలా చేస్తే అసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Admin

Recent Posts