Beetroot : ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌నిస‌రిగా బీట్ రూట్ ను తీసుకోండి.. ఎందుకంటే..?

Beetroot : బీట్‌రూట్ మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంది. అయితే ఈ సీజ‌న్‌లో బీట్‌రూట్‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా తినలేక‌పోతే జ్యూస్ రూపంలో అయినా తీసుకోవ‌చ్చు. ఒక క‌ప్పు బీట్‌రూట్ ముక్క‌ల‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం లంచ్‌కు ముందు తినాలి. లేదా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో ఒక క‌ప్పు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాలి. దీంతో ఈ సీజ‌న్‌లో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

you should definitely take beetroot in this season know the reason

1. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అందువ‌ల్ల బీట్‌రూట్‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.

2. బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే ప‌లు స‌మ్మేళ‌నాలు మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకునేలా చేస్తాయి. అందువ‌ల్ల బీట్‌రూట్‌ను రోజూ కచ్చితంగా తీసుకోవాలి.

3. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చాలా మందికి జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. అలాంటి వారు బీట్‌రూట్‌ను తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బీట్‌రూట్‌లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

4. చ‌లికాలంలో చ‌ర్మం పొడిగా మారుతుంది. కొంద‌రికి చ‌ర్మం ఎక్కువ‌గా ప‌గిలి దుర‌ద పెడుతుంది. అలాంటి వారు బీట్‌రూట్‌ను తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చ‌ర్మం సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

5. శీతాకాలంలో గుండె జ‌బ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి. బీపీ కూడా పెరుగుతుంది. ఈ రెండు స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకు బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవాలి. దీని వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె సుర‌క్షితంగా ఉంటుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఫ‌లితంగా బీపీ త‌గ్గుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో రోజూ బీట్‌రూట్‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

Admin

Recent Posts