రోజూ ఉదయాన్నే పరగడుపున చాలా మంది టీ, కాఫీలను తాగుతుంటారు. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను తాగాలి. దీని వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోవడమే కాదు, అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాంటి పానీయాల్లో పసుపు నీళ్లు కూడా ఒకటి. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పరగడుపునే గోరు వెచ్చని నీటిలో పసుపు కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. ఆ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడవచ్చు.
2. వయస్సు మీద పడడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. కానీ రోజూ పసుపు కలిపిన గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అల్జీమర్స్ ను తగ్గిస్తుంది. మెదడు దెబ్బతినకుండా చూస్తుంది.
3. పసుపు నీళ్లను రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. చర్మాన్ని సంరక్షించడంలో పసుపు ఎంతో మేలు చేస్తుంది. పసుపు నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. కణాలు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. చర్మం చక్కని నిగారింపును, రంగును సొంతం చేసుకుంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
5. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల వాపులు తగ్గుతాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
6. గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకుని పరగడుపున తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు.
7. పసుపు నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
8. పసుపు నీళ్లను తాగితే డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
9. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరడచంలో పసుపు ఎంతో బాగా పనిచేస్తుంది. పసుపు నీళ్లను రోజూ తాగుతుంటే లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ సురక్షితంగా ఉంటుంది. జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి.