Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

Admin by Admin
June 27, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మహాభారతంలో అసంఖ్యాకమైన పాత్రలున్నాయి. వారిలో కొందరికి ఒకటికంటే ఎక్కువ పేర్లున్నాయి. భీష్ముడికి చాలా పేర్లున్నాయి. అర్జునుడికి పది పేర్లున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తూ వాతావరణం భయానకంగా ఉంటే అర్జున ఫల్గున పార్థ కిరీటి… అనే అర్జునుడి పది పేర్లను స్మరించినట్లయితే పిడుగుల భయం తొలగి, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని వెనకటితరంలో పెద్దలు చెప్పేవారు. అలా చేసేవారు కూడా. అది ఒక నమ్మకం, ఈ తరానికి తెలియని విషయం. పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు కౌరవులతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. జమ్మిచెట్టు మీది బాణాలు తీసేటప్పుడు తాను అర్జునుణ్ననే నమ్మకం ఉత్తర కుమారుడికి కలిగించే ప్రయత్నంలో అతడు పాండవ మధ్యముడి పది పేర్లు చెప్పమంటే అర్జునుడే స్వయంగా తన పది పేర్లు చెప్పుకొన్నాడు.

అంతేకాదు ఆ పేర్ల సార్థక్యాన్నీ వివరించాడు. అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు అనేవి ఆ పది పేర్లు. అర్జున అంటే తెల్లని వర్ణమని అర్థం. అర్జునుడు తెల్లగా ఉంటాడు. అది నిర్మల వర్ణం. మొత్తం భూమిలో తన వర్ణంతో సమానమైన వర్ణం దుర్లభమని, తాను పరిశుద్ధమైన పని చేస్తానని, అందుకే తనను అర్జునుడంటారని భారతంలో అతడు ఉత్తరుడితో చెబుతాడు. అర్జునుడు ఉత్తర ఫల్గునీ విశేషకాలంలో అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధి కాలంలో జన్మించడంవల్ల ఫల్గునుడయ్యాడు. కుంతీదేవికి పృథ అనే పేరుంది. ఆమె కొడుకుల్లో చివరివాడైన అర్జునుడికి పార్థుడనే పేరు వచ్చింది. ఇంద్రుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి ఇచ్చిన కిరీటం యుద్ధంలో అతడి శిరస్సు మీద ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఆ కిరీటం అభేద్యం, సుస్థిరం. అందుకే అర్జునుడు కిరీటి.

what are the 10 names of arjuna and their meanings

యుద్ధరంగంలో అర్జునుడు ఎప్పుడూ తన రథానికి నియమంగా తెల్లటి గుర్రాలనే కడతాడు గనుక శ్వేతవాహనుడని పేరు వచ్చింది. అర్జునుణ్ని బీభత్సుడంటారు. బీభత్సమంటే చూసేవారికి ఒళ్లు జలదరించేలా చేసే స్థితి. యుద్ధరంగంలో అర్జునుడు శత్రువుల్ని చీల్చిచెండాడినప్పుడు అటువంటి దృశ్యాలను సృష్టిస్తాడు కనుక బీభత్సుడయ్యాడు. ఎంతటి బలవంతులు తనను ఎదిరించినా, యుద్ధంలో జయాన్ని సాధించగలడు. అందుకే అందరూ అర్జునుణ్ని విజయుడంటారు. తాను చూస్తుండగా యుద్ధంలో ఎవరైనా ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే వాళ్లను హతమారుస్తాడు గనుక తాను జిష్ణుడనని అర్జునుడు చెప్పాడు. యుద్ధరంగంలో ఏ చేతితోనైనా అల్లెతాటిని లాగగలడు. కానీ ఆ లాగడంలో ఎడమచేతి వాటం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి సవ్యసాచిగా అర్జునుడు ప్రసిద్ధుడయ్యాడు.భూమినంతటినీ జయించి పరాజితులైన రాజుల నుంచి అపారమైన ధనం పొందడంవల్ల ధనంజయుడయ్యాడు.

ఖాండవ వన దహన సమయంలో శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై అర్జునుడికి కృష్ణుడు అనే నామధేయాన్ని ప్రసాదించి దివ్యాస్త్రాలు ఇచ్చారు. ఈ విధంగా అర్జునుడికి పదకొండు పేర్లయినా పది పేర్లే ప్రసిద్ధం. వీటిలో మహాభారతంలోనూ భారత సంబంధమైన కావ్య నాటకాదుల్లోనూ- ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, సవ్యసాచి, ధనంజయుడు అనే పేర్లు ఎక్కువగా ప్రశస్తమయ్యాయి.

Tags: Arjuna
Previous Post

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

Next Post

శాపం కార‌ణంగానే శ్రీకృష్ణుడు అవ‌తారం చాలించాడా..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.