ఆరోగ్యం

రోజూ గుప్పెడు మోతాదులో జీడిప‌ప్పును తిని చూడండి.. ఆపై క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మీరే తెలుసుకుంటారు..!

జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇత‌ర పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. జీడిపప్పు.. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బాగా ప‌నిచేస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ఈ ప‌ప్పులో అధిక పరిమాణంలో ఆరోగ్య‌క‌ర‌మైన‌ కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల జీడిప‌ప్పును తిన‌వ‌చ్చు. దీన్ని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of eating a handful of cashew nuts every day

1. జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

2. జీడిపప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి బరువును తగ్గించడంలోనూ సహాయపడ‌తాయి. కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. బరువును తగ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు జీడిప‌ప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే మేలు జ‌రుగుతుంది.

3. జీడిపప్పులోని పోష‌కాలు కంటి రెటీనాను రక్షిస్తాయి. కళ్ల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి.

4. జీడిపప్పును రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే స్టెరిక్ ఆమ్లం జీడిపప్పులో ఉంటుంది. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ప‌ప్పులో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. గుండెను సంర‌క్షిస్తాయి. అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. జీడిపప్పులో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్, విటమిన్ కె, విటమిన్ బి6 లు ఉంటాయి. వీటి వ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. పోష‌కాల లోపాన్ని నివారించ‌వ‌చ్చు.

6. ఈ ప‌ప్పులో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల‌ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తాయి.

యూఎస్‌డీఏ ప్రకారం, 28.35 గ్రాముల జీడిపప్పులో 157 కేలరీల శ‌క్తి, 8.56 గ్రా. కార్బోహైడ్రేట్లు, 1.68 గ్రా. చక్కెర, 0.9 గ్రా. ఫైబర్, 5.17 గ్రా. ప్రోటీన్, కొవ్వు 12.43 గ్రా., కాల్షియం 10 మి.గ్రా., ఇనుము 1.89 మి.గ్రా., మెగ్నీషియం 83 మి.గ్రా., ఫాస్ఫ‌ర‌స్ 187 మి.గ్రా., పొటాషియం 3 మి.గ్రా., సోడియం 1.64 మి.గ్రా., జింక్ ఉంటాయి. అందువ‌ల్ల జీడిప‌ప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts