అవిసె గింజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. అవిసె గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. అయితే అవిసె గింజలను కొందరు నేరుగా తినలేరు. అలాంటి వారు వాటిని ఈ విధంగా తీసుకోవచ్చు.
అవిసె గింజలు, మినుములు, శనగలు, ఎండు మిరపకాయలను కొద్ది కొద్దిగా తీసుకుని అన్నింటినీ పెనంపై వేయించాలి. తరువాత వాటిని పొడిలా పట్టుకోవాలి. ఆ పొడిని రోజూ తినే ఆహారంపై చల్లుకుని తినవచ్చు.
పైన చెప్పిన విధంగా తయారు చేసుకున్న పొడిని కూరల్లోనూ వేయవచ్చు. అలాగే సాంబార్, సూప్, ఇతర రైస్ వంటకాల్లో వేయవచ్చు. దీంతో అవిసెగింజలను తీసుకున్నట్లు అవుతుంది. వాటితో ప్రయోజనాలను పొందవచ్చు.