Cinnamon Tea For Cholesterol : మనల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం. షుగర్ వ్యాధి కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఆహార నియమాలను పాటిస్తూ నిరంతరం మందులను వాడినప్పటికి కొందరిలో షుగర్ నియంత్రణలోకి రాదు. అలాంటి వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో టీ ని తయారు చేసి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
షుగర్ వ్యాధిని నియంత్రించే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. దీనికి కావల్సిన పదార్థాలు ఏమిటి… అలాగే ఈ టీ ని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీని తయారు చేసుకోవడానికి ఒక టీ స్పూన్ మెంతులను, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, నాలుగు లవంగాలను, రెండు యాలకులను, 6 తులసి ఆకులను, ఒక టీ స్పూన్ పసుపును, రెండు గ్లాసుల నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో పైన పదార్థాలన్నీ వేసి రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి.
తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీని రోజూ ఉదయం టీ తాగే సమయంలో తీసుకోవాలి. అలాగే ఈ టీ గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ టీ ని తీసుకోవడానికి అర గంట ముందు అలాగే తీసుకున్న తరువాత అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా పది రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఈ టీ తయారీలో వాడిన పదార్థాలన్నీ కూడా మన వంటింట్లో ఉండేవే. ఈ పదార్థాలు ఔషధ గుణాలతో పాటురక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాన్ని సహజంగానే కలిగి ఉంటాయి. ఈ టీ ని తాగడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగి సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ టీని తాగడం వల్ల దగ్గు, ఆస్థమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కూడా ఈ టీ కి ఉంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ విధంగా ఈ టీని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.