లెమన్‌ గ్రాస్‌ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

లెమన్‌ గ్రాస్.. దీన్నే కొన్ని ప్రాంతాల్లో నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. నిమ్మ గడ్డి అనే పేరులోనే ఉంది కనుక ఇది అచ్చం నిమ్మలాగే వాసన వస్తుంది. అయితే ఈ గడ్డితో టీ తయారు చేసుకుని నిత్యం తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

lemon grass tea preparation and its health benefits in telugu

* నిమ్మగడ్డి టీని నిత్యం తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

* డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం ఈ టీని తాగితే ఎంతగానో మేలు చేస్తుంది. వారి షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

* హైబీపీ ఉన్నవారు లెమన్‌ గ్రాస్‌ టీని నిత్యం సేవిస్తుంటే బీపీ అదుపులోకి వస్తుంది.

* ఈ టీని రోజూ తాగడం వల్ల క్యాన్సర్‌ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

* జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి, ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు, ఆందోళన, తలనొప్పి సమస్యలకు లెమన్‌ గ్రాస్‌ టీ అద్భుతంగా పనిచేస్తుంది.

* గొంతు సమస్యలు, దగ్గు, జలుబు, అలర్జీలు ఉన్నవారు ఈ టీని తాగితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

* లెమన్‌ గ్రాస్‌ టీని తాగడం వల్ల చర్మం, వెంట్రుకలు సంరక్షించబడతాయి.

లెమన్‌ గ్రాస్‌ టీని ఇలా చేయాలి

కావల్సిన పదార్థాలు

* నీళ్లు – 4 కప్పులు
* బాగా సన్నగా తరిగిన లెమన్‌ గ్రాస్‌ కాడలు – 2 కప్పులు
* తేనె – పావు కప్పు

తయారు చేసే విధానం

ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అనంతరం అందులో లెమన్‌ గ్రాస్‌ కాడలను వేసి మళ్లీ 5 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. తరువాత మంట తగ్గించి సిమ్మర్‌లో ఉంచి మళ్లీ 5 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం స్టవ్‌ ఆర్పి టీని కిందకు దించి దాన్ని వడకట్టాలి. ఆ టీలో తేనె కలుపుకుని వేడిగా ఉండగానే తాగేయాలి. తేనె అవసరం లేదనుకుంటే నేరుగా కూడా తాగవచ్చు. లేదా చక్కెర, బెల్లం కూడా కలుపుకోవచ్చు. ఈ టీని నిత్యం తాగడం వల్ల పైన తెలిపిన లాభాలను పొందవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts