Rice Water For Hair : మనం సాధారణంగా అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎంతో కాలంగా అన్నం మనకు ప్రధాన ఆహారంగా ఉంటూ వస్తుంది. బియ్యాన్ని ఉడికించగా వచ్చిన అన్నాన్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బియ్యాన్ని వండడానికి ముందు వాటిని మనం నీటితో కడుగుతాం. సాధారణంగా చాలా మంది ఈ బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటారు. కానీ ఈ నీటిని పారబోయకుండా వాడడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో ఈ బియ్యం కడిగిన నీటితో స్నానం కూడా చేసే వారు. ఈ నీరు చర్మానికి టోనర్ గా పని చేస్తుంది. చర్మం సాగకుండా చేస్తుంది.
అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీళ్లు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో బియ్యం కడిగిన నీటిని తీసుకోవాలి. తరువాత వాటిలో దూదిని ముంచి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. ఇలా రాసిన పది నిమిషాల తరువాత సాధారణ నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ముఖం పై వచ్చే మొటిమలను, మచ్చలను కూడా మనం బియ్యం కడిగిన నీటిని ఉపయోగించి తగ్గించుకోవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో పసుపు, శనగపిండి, కొబ్బరి నూనె, నిమ్మరసం, పాలు, బియ్యం కడిగిన నీరు పోసి పేస్ట్ లా చేసుకోవాలి.
తరువాత ఈ పేస్ట్ ను ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి. ఈ ఫ్యాక్ పూర్తిగా ఆరిపోయిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల చర్మ సమస్యలు తగ్గడంతో పాటు చర్మం యొక్క రంగు కూడా మెరుగుపడుతుంది. చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే బియ్యం కడిగిన నీటిని ముఖానికి, మెడకు రాస్తూ మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండ వల్ల నిస్తేజంగా మారిన చర్మం మృదువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల చర్మం పై ఉండే ముడతలు కూడా తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీటిలో దాల్చిన చెక్క పొడిని వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి. ఆరిన నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
చర్మం కూడా కాంతివంతవంగా తయారవుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు జుట్టు పెరుగుదలలోనూ బియ్యం కడిగిన నీరు మనకు ఉపయోగపడుతుంది. తలస్నానం చేయడానికి ముందు బియ్యం కడిగిన నీటిని తలకు రాసి మర్దనా చేసి అరగంట పాటు అలాగే ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. బియ్యం కడిగిన నీటిలో ఉండే ఖనిజాలు, విటమిన్స్, పోషకాలు జుట్టుకు అంది జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు మెత్తగా మెరుస్తూ ఉంటుంది. కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం కడిగిన నీరు జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.