Weight : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా మనలో చాలామంది స్థూలకాయం బారిన పడుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ స్థూలకాయం కారణంగా మనం ఎన్నో ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తోంది. బరువు తగ్గాలనుకునే వారికి మన చుట్టూ ఉండే వారు వ్యాయామం చేయమని, డైటింగ్ చేయమని సలహాలు ఇస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, ఆహార నియమాలను పాటించడం వంటివి చేసేటప్పుడు మొదట్లో బాగానే ఉంటాయి. తరువాత వాటిని చేయలేక చాలా మంది మానేస్తూ ఉంటారు.
కొందరు ఎంత కష్టమైనప్పటికీ వ్యాయామం, డైటింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాటి వల్ల కలిగే ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది. మనం బరువు పెరగకూడదు అనే కారణం వల్ల మనకు ఇష్టమైన పదార్థాలను జీవితాంతం తినకుండా ఉండలేం. వ్యాయామం చేయడం వల్ల కూడా బరువు తగ్గుతాం. కానీ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేయాలి. మన రోజువారీ పనుల్లో వ్యాయామానికంటూ కొంత సమయం కేటాయించాలి. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కనుక అలాంటి వారు ఇంట్లోనే ఒక డ్రింక్ ను తయారు చేసుకుని మూడు పూటలా తాగడం వల్ల నెల రోజుల్లోనే 8 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.
కేవలం బరువు తగ్గడమే కాకుండా ఈ డ్రింక్ ను తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అందులో వాడే పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గాను మనం కొత్తిమీరను ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్తిమీరను మనం వంటల్లో తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. కొత్తిమీరకు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, పొట్ట చుట్టూ అధికంగా ఉండే కొవ్వును కరిగించే శక్తి ఉంటుంది.
అంతేకాకుండా కొత్తిమీరలో ఔషధ గుణాలతోపాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర పేస్ట్ ను వేసి కలిపి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. ఈ విధంగా చేయడం వల్ల కొత్తిమీర డ్రింక్ తయారవుతుంది.
ఈ డ్రింక్ ను ఉదయం పరగడుపున, మధ్యాహ్నం భోజనం చేసిన ఒక గంట తరువాత అలాగే రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు ఇలా రోజుకు మూడు పూటలా తీసుకోవాలి. ఈ విధంగా ఈ డ్రింక్ ను తాగడం వల్ల 3 రోజుల్లోనే మన శరీరంలో మనకు తేడా కనబడుతుంది. ఈ విధంగా ఈ డ్రింక్ ను క్రమం తప్పకుండా తాగడం వల్ల చాలా త్వరగా, చాలా సులభంగా మనం బరువు తగ్గవచ్చు.