Over Weight : ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. మారిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక శ్రమ చేయకపోవడం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల అధిక బరువు బారిన పడుతున్నారు. అధిక బరువు కారణంగా హార్ట్ ఎటాక్, షుగర్, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడం, కీళ్ల నొప్పులు వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇలా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం వీలైనంత త్వరగా బరువు తగ్గడం చాలా ముఖ్యం. మనలో చాలా మంది బరువు తగ్గడానికి వ్యాయామాలు, యోగా, వాకింగ్, కచ్చితమైన ఆహార నియమాలను పాటించడం వంటి వివిధ రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. వీటితోపాటు కింద చెప్పే ఇంటి చిట్కాను పాటించడం వల్ల కూడా మనం చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను పాటించడం వల్ల మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి గాను మనం ఒక గ్లాస్ నీటిని, జీలకర్రను, తేనెను, నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవాలి. ప్రతిరోజూ ఈ జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. ఈ చిట్కాను పాటిస్తూనే వాకింగ్, వ్యాయామం, యోగా వంటివి చేస్తూ ఉండాలి.
ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మనం ఎక్కువగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడే వారు ప్రతిరోజూ చేసే వ్యాయామాలతోపాటు జీలకర్ర నీటిని తయారు చేసుకుని వాడడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.