Dates Ragi Laddu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ఇవి సాధారణ రూపంతోపాటు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ మనకు లభిస్తాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఖర్జూరాలను రోజూ తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఖర్జూరాలను, రాగులను ఉపయోగించి తయారు చేసే లడ్డూలు ఎంతో బలవర్ధకమైనవి. వీటిని రోజుకు ఒకటి తిన్నా చాలు.. మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. ఓ వైపు శక్తి, మరోవైపు పోషకాలు రెండూ లభిస్తాయి. కనుక వీటిని రోజూ తినాలి. ఇక ఖర్జూరాలు, రాగులతో లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరాలు, రాగుల లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగులు – 1 కప్పు వేయించి పొడి చేయాలి, గింజలు లేని ఖర్జూరాలు – 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, నెయ్యి , యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు – తగినంత.
ఖర్జూరాలు, రాగుల లడ్డూలను తయారు చేసే విధానం..
ఒక బౌల్ తీసుకుని దానిలో రాగి పిండి వేసి అందులో నెయ్యి వేసి కలపాలి. అందులో యాలకుల పొడి, కొబ్బరి పొడి, కట్ చేసి పెట్టిన డేట్స్ వేసి బాగా కలపాలి. బాగా మిక్స్ అయిన మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలలా చుట్టుకోవాలి. వీటిపై జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఖర్జూరాలు, రాగుల లడ్డూలు రెడీ అవుతాయి. వీటిని నిల్వ చేస్తే 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీటిని రోజుకు ఒకటి చొప్పున తినాలి. ఎంతో బలం కలుగుతుంది. అనేక పోషకాలు లభిస్తాయి. చిన్నారులకు ఇస్తే ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. తెలివితేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. పెద్దలు తింటే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గుతాయి. శరీరానికి బలం కలుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. కనుక ఈ లడ్డూలను రోజుకు ఒకటి తినాలి.