Jeera Rice : జీరా రైస్ ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..!

Jeera Rice : మ‌నం సాధార‌ణంగా అన్నంతో త‌యారు చేసే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌లో జీరా రైస్ ఒక‌టి. జీరా రైస్ చాలా రుచిగా ఉంటుంది. కూర‌ను త‌యారు చేసే స‌మ‌యం లేన‌ప్పుడు అన్నంతో జీరా రైస్ ను త‌యారు చేసుకొని తిన‌వ‌చ్చు. అంతే కాకుండా జీల‌క‌ర్ర‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. క‌నుక జీల‌క‌ర్రతో చేసే ఈ జీరా రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Jeera Rice is very healthy and tasty know how to cook it
Jeera Rice

జీరా రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించి చ‌ల్లార్చిన అన్నం – ఒక క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్‌, బిర్యానీ ఆకు -ఒక‌టి, యాలకులు – 2 , ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – 2 (చిన్న ముక్క‌లు), జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్‌, పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 6 లేదా 7, ఉప్పు – రుచికి స‌రిప‌డా, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌.

జీరా రైస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక కళాయిలోనూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, యాల‌కులు, ల‌వంగాలు, దాల్చిన చెక్క వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించుకోవాలి. ఇవి వేగాక జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక రుచికి స‌రిప‌డా ఉప్పును వేసి క‌లుపుకోవాలి. ఇవి పూర్తిగా వేగాక.. ముందుగా చ‌ల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత మిరియాల పొడి వేసి క‌లిపి.. మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉంచిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే జీరా రైస్ త‌యార‌వుతుంది. జీరా రైస్ త‌యారీలో నూనె కు బ‌దులుగా నెయ్యిని, అన్నం త‌యారీలో సాధార‌ణ బియ్యానికి బ‌దులుగా బాస్మతీ బియ్యాన్ని కూడా వాడుకోవ‌చ్చు. జీరా రైస్ ను నేరుగా లేదా కుర్మా వంటి కూర‌ల‌తో క‌లిపి తిన‌డం వ‌ల్ల చాలా రుచిగా ఉంటుంది. జీల‌క‌ర్ర‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

D

Recent Posts