Jowar Laddu : జొన్న లడ్డూలు.. రోజుకు ఒకటి తింటే చాలు.. ఇలా తయారు చేసుకోవాలి..!

Jowar Laddu : జొన్నలు చిరు ధాన్యాల జాబితాకు చెందుతాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. అందుకనే చాలా మంది జొన్నలతో గటక, సంగటి, రొట్టె, జావ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే జొన్నలతో లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఆరోగ్యకరమైన పద్ధతిలో తయారు చేసుకుంటే.. ఎవరైనా సరే తినవచ్చు. జొన్నలతో తయారు చేసిన లడ్డూను రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. మనకు అమితమైన శక్తి లభిస్తుంది. పైగా అనేక పోషకాలు కూడా అందుతాయి. ఇక జొన్నలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Jowar Laddu eat one daily make them in this way
Jowar Laddu

జొన్నల లడ్డూలు తయారీకి కావల్సిన పదార్థాలు..

జొన్నలు – ఒక కప్పు, బెల్లం – ముప్పావు కప్పు, కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూన్‌, జీడిపప్పు – నాలుగైదు (పలుకులు చేయాలి), నెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌, గోరు వెచ్చని పాలు – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీస్పూన్‌.

జొన్న లడ్డూలు తయారు చేసే విధానం..

స్టవ్‌ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జొన్నలు వేసి దోరగా వేయించుకుని తీయాలి. అవి చల్లారాక మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా బెల్లం, జీడిపప్పు, కొబ్బరి కలిపి మిక్సీలో గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు పాలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలిపి.. పాలు చల్లుకుంటూ లడ్డూల్లా తయారు చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన జొన్న లడ్డూలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండింటినీ పొందవచ్చు. రోజుకు ఒక జొన్న లడ్డూను తింటే అనేక ప్రయోజనాలు కలగడంతోపాటు జొన్నల్లో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

Share
Admin

Recent Posts