Pudina Karam Podi : పుదీనా కారం పొడి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!

Pudina Karam Podi : మనం పుదీనా ఆకులను తరచూ వంటల్లో వేస్తుంటాం. వీటి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతేకాదు ఈ ఆకులను ఎలా తీసుకున్నా సరే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అయితే పుదీనా ఆకులతోనూ అనేక రకాల వంటలను చేయవచ్చు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ అకులతో చేసే వంటల్లో పుదీనా కారం పొడి కూడా ఒకటి. సాధారణంగా చాలా మంది వివిధ రకాల కారంపొడిలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే పుదీనా కారం పొడిని కూడా తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..

పుదీనా ఆకులు – 2 కప్పులు, ఎండు మిర్చి – 15, ధనియాలు – అర కప్పు, మినప పప్పు – పావు కప్పు, నూనె – 3 టీస్పూన్లు, చింతపండు – రుచికి తగినంత, ఉప్పు – తగినంత.

Pudina Karam Podi very healthy and tasty
Pudina Karam Podi

పుదీనా కారం పొడిని తయారు చేసే విధానం..

పుదీనా ఆకులను శుభ్రం చేసి తడి లేకుండా గాలికి బాగా ఆరబెట్టాలి. బాణలిలో నూనె కాగగానే ఎండు మిర్చి, ధనియాలు, మినపపప్పు వేసి దోరగా వేయించాలి. తరువాత అందులోనే పుదీనా ఆకులు వేసి పళపళమనే వరకు వేగించాలి. మిశ్రమం చల్లారిన తరువాత చింతపండు, ఉప్పు వేసి కలిపి మెత్తగా దంచుకోవాలి. ఈ పొడిని అన్నంతో మొదటి ముద్ద తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే దీన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితోనూ తినవచ్చు. పుదీనా ఆకులతో కారం పొడిని ఇలా తయారు చేసి తినడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి.

Share
Editor

Recent Posts